GSLV F14 Launch: రేపే జీఎస్ఎల్‌వీ ఎఫ్-14 ప్రయోగం.. కౌంట్‌డౌన్ ప్రారంభం
ఇస్రో విజయాల పరంపరలో మరో కిలికితురాయి చేరబోతోంది.
దిశ, వెబ్‌డెస్క్: ఇస్రో విజయాల పరంపరలో మరో కిలికితురాయి చేరబోతోంది. రేపు సాయంత్రం సరిగ్గా 5.35 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-14(GSLV F-14) రాకెట్‌ను శ్రీహరి కోట నుంచి ప్రయోగించనున్నారు. అప్పటికే రాకెట్ లాంఛ్‌కు ఇవాళ మధ్యాహ్నం 2.05 గంటల నుంచి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. రాకెట్ ప్రయోగానికి మొత్తం 27.30 గంటల సమయం పట్టనుంది ఇస్రో సైంటిస్ట్‌లు తెలిపారు. దాదాపు 2,272 కిలోల బరువుతో శాస్త్రవేత్తలు రాకెట్‌ను రూపొందించారు. ఇన్‌శాట్-3 డీఎస్ ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కి.మీ ఎత్తులోని భూ కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు.
https://www.isro.gov.in/GSLVF14_INSAT_3DS_Livestreaming.html