గ్రాన్యూల్స్ ఇండియా లాభం 71% వృద్ధి

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఔషధ సంస్థ గ్రాన్యూల్స్ ఇండియా 2020-21 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికం ఫలితాల్లో ఏకీకృత నికర లాభం 70.82 శాతం పెరిగి రూ. 163.63 కోట్లకు చేరుకున్నట్టు మంగళవారం వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 95.79 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాల ఆదాయం రూ. 858.12 కోట్లని, గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 699.53 కోట్లని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో […]

Update: 2020-10-20 09:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఔషధ సంస్థ గ్రాన్యూల్స్ ఇండియా 2020-21 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికం ఫలితాల్లో ఏకీకృత నికర లాభం 70.82 శాతం పెరిగి రూ. 163.63 కోట్లకు చేరుకున్నట్టు మంగళవారం వెల్లడించింది.

గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 95.79 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాల ఆదాయం రూ. 858.12 కోట్లని, గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 699.53 కోట్లని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 22.7 శాతం వృద్ధిని సాధించడం పట్ల ఆనందంగా ఉంది.

సంస్థకు చెందిన అన్ని వ్యాపార విభాగాలు వరుస త్రైమాసికంలో బలమైన పనితీరును నమోదు చేశాయి’ అని గ్రాన్యూల్స్ ఇండియా ఛైర్మన్, ఎండీ కృష్ణ ప్రసాద్ చిగురుపాటి చెప్పారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో కంపెనీ ఒక్కో షేర్‌పై డివిడెండ్‌ను రూ. 1 గా కంపెనీ బోర్డు ఆమోదించినట్టు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.

Tags:    

Similar News