నేటితో ముగియనున్న పట్టభద్రుల ఎన్నికల ప్రచారం

దిశ,వెబ్‌డెస్క్: నేటితో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో అధికారులు ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. మూడు ఉమ్మడి జిల్లాలో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ కొత్తగా ఏర్పాటైన జిల్లాల పద్ధతిలోనే ఎన్నికల నిర్మాహణ చేస్తున్నారు. మహబూబ్‌నగర్, నాగకర్నూల్, వనపర్తి, గద్వాల్ వికారాబాద్, రంగారెడ్డి, జోగులాంబా, నారాయణపేట, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాలో అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో మునిగిపోయారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 93 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అత్యధికంగా అభ్యర్థులుండటంతో జెంబో బ్యాలెట్ పేపర్‌తో […]

Update: 2021-03-11 20:39 GMT

దిశ,వెబ్‌డెస్క్: నేటితో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో అధికారులు ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. మూడు ఉమ్మడి జిల్లాలో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ కొత్తగా ఏర్పాటైన జిల్లాల పద్ధతిలోనే ఎన్నికల నిర్మాహణ చేస్తున్నారు. మహబూబ్‌నగర్, నాగకర్నూల్, వనపర్తి, గద్వాల్ వికారాబాద్, రంగారెడ్డి, జోగులాంబా, నారాయణపేట, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాలో అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో మునిగిపోయారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 93 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అత్యధికంగా అభ్యర్థులుండటంతో జెంబో బ్యాలెట్ పేపర్‌తో బ్యాలెట్ బాక్స్ సిద్ధం చేశారు. తొమ్మిది జిల్లాల్లో మొత్తం 5లక్షల 36 వేల 268 ఓటర్లున్నారు. అత్యధికంగా రంగారెడ్డిలో ,నారాయణ పేట జిల్లాలోనే ఉన్నారు.

Tags:    

Similar News