గౌడ్‌లకు గౌడబంధు అమలు చేయాలి : స్వామి గౌడ్
దిశ, తెలంగాణ బ్యూరో : దళితులకు ఇస్తున్న మాదిరిగానే గౌడ్ల ఆర్థికాభివృద్ధికి గౌడ బంధు పథకం అమలు చేయాలని తెలుగునాడు కల్లుగీత కార్మిక సంఘం జాతీయ అధ్యక్షుడు కొయ్యాడ స్వామిగౌడ్ డిమాండ్ చేశారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ భవన్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 371వ జయంతిని ఘనంగా నిర్వహించారు. పాపన్న గౌడ్ చిత్రపటానికి టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు, పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, తెలుగునాడు కల్లుగీత కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షుడు గజేంద్రగౌడ్ […]
దిశ, తెలంగాణ బ్యూరో : దళితులకు ఇస్తున్న మాదిరిగానే గౌడ్ల ఆర్థికాభివృద్ధికి గౌడ బంధు పథకం అమలు చేయాలని తెలుగునాడు కల్లుగీత కార్మిక సంఘం జాతీయ అధ్యక్షుడు కొయ్యాడ స్వామిగౌడ్ డిమాండ్ చేశారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ భవన్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 371వ జయంతిని ఘనంగా నిర్వహించారు. పాపన్న గౌడ్ చిత్రపటానికి టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు, పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, తెలుగునాడు కల్లుగీత కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షుడు గజేంద్రగౌడ్ లతో కలిసి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌడ్ లకు గౌడబంధు కేటాయించాలని కోరుతూ అన్ని పార్టీలను కలుపుకొని త్వరలోనే ఇందిరాపార్కు వద్ద ధర్నా చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. బహుజన రాజ్యాన్ని స్థాపించిన ఏకైక వ్యక్తి పాపన్న గౌడ్ అన్నారు. టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు, పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, తెలుగునాడు కల్లుగీత కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షుడు గజేంద్రగౌడ్ లు మాట్లాడుతూ బీద ప్రజల రక్షణకు తన జీవితాన్నే అంకితం చేసిన మహోన్నత వ్యక్తి పాపన్న గౌడ్ అన్నారు. ఆయన ఆశయ సాధనకు నేటి యువత పాటుపడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు అజ్మీరా రాజు నాయక్, జీవీజీ నాయుడు, బీసీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపతి సతీష్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి ముంజ వెంకట రాజంగౌడ్, రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శులు గుడెపు రాఘవు, సంధ్యపోగు రాజశేఖర్, యాండ్రా లోకేష్, శివకుమార్ గౌడ్, రామాంజనేయులు గౌడ్, నక్క కృష్ణ, సాంబ శివ గౌడ్ , కల్పన, లచ్చగౌడ్ తదితరులు పాల్గొన్నారు.