కరోనా, ఇంధన ధరలకు అన్‌లాక్: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చమురు ధరల పెంపును పేర్కొంటూ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. కరోనా కేసులు పెరుగుతున్న తీరును వివరిస్తూ దాదాపు ప్రతిరోజు కాంగ్రెస్ నేతలు కేంద్రాన్ని ఇరుకున పెడుతున్నారు. తాజాగా, దానికి పెట్రోల్-డీజిల్ ధరల పెంపునూ జోడించారు. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తేస్తున్న దశలను కేంద్ర ప్రభుత్వం ‘అన్‌లాక్’గా వ్యవహరిస్తున్నది. ఈ పదాన్నే మోడీ సర్కారుపై దాడికి వినియోగించారు. కేవలం కరోనానే కాదు, ఇంధన ధరలనూ మోడీ ప్రభుత్వం అన్‌లాక్ చేశారని […]
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చమురు ధరల పెంపును పేర్కొంటూ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. కరోనా కేసులు పెరుగుతున్న తీరును వివరిస్తూ దాదాపు ప్రతిరోజు కాంగ్రెస్ నేతలు కేంద్రాన్ని ఇరుకున పెడుతున్నారు. తాజాగా, దానికి పెట్రోల్-డీజిల్ ధరల పెంపునూ జోడించారు. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తేస్తున్న దశలను కేంద్ర ప్రభుత్వం ‘అన్‌లాక్’గా వ్యవహరిస్తున్నది. ఈ పదాన్నే మోడీ సర్కారుపై దాడికి వినియోగించారు. కేవలం కరోనానే కాదు, ఇంధన ధరలనూ మోడీ ప్రభుత్వం అన్‌లాక్ చేశారని ఓ గ్రాఫ్‌ను జతచేసి ఆయన ట్వీట్ చేశారు.