బంగారు ఆభరణాలపై అది తప్పనిసరి

దిశ, వెబ్‌డెస్క్: బంగారం స్వచ్ఛతను నిర్ధారించే హాల్‌మార్క్‌ను ఈ ఏడాది జూన్ 1 నుంచి తప్పనిసరి చేయడానికి సిద్ధమవుతున్నట్టు మంగళవారం ప్రభుత్వం తెలిపింది. జూన్ 1 తర్వాత బీఐఎస్‌కు మారడానికి గడువును పొడిగించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. బంగారం స్వచ్ఛతను నిర్ధారించే హాల్‌మార్క్ పద్ధతి అమలు చేయాలని 2019లో ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం వ్యాపారులకు 2021, జనవరి 15 వరకు గడువు కూడా ఇచ్చింది. అయితే, గతేడాది కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంతో వ్యాపారులు గడువును […]

Update: 2021-04-13 09:16 GMT
gold
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: బంగారం స్వచ్ఛతను నిర్ధారించే హాల్‌మార్క్‌ను ఈ ఏడాది జూన్ 1 నుంచి తప్పనిసరి చేయడానికి సిద్ధమవుతున్నట్టు మంగళవారం ప్రభుత్వం తెలిపింది. జూన్ 1 తర్వాత బీఐఎస్‌కు మారడానికి గడువును పొడిగించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. బంగారం స్వచ్ఛతను నిర్ధారించే హాల్‌మార్క్ పద్ధతి అమలు చేయాలని 2019లో ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం వ్యాపారులకు 2021, జనవరి 15 వరకు గడువు కూడా ఇచ్చింది. అయితే, గతేడాది కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంతో వ్యాపారులు గడువును పెంచాలని కేంద్రాన్ని కోరారు. దాంతో జూన్ 1 వరకు గడువు పొడిగించారు.

తాజాగా దీన్ని మరోసారి పొడిగించే అవకాశం లేదని స్పష్టం చేసింది. ఇప్పటివరకు 34,647 మంది వ్యాపారులు బీఐఎస్‌లో నమోదు చేసుకున్నారు. రాబోయే రెండు నెలల్లో సుమారు లక్ష మందికి పైగా నమోదవుతారని బిఐఎస్ డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ చెప్పారు. జూన్ 1 నుంచి 14, 18, 22 క్యారెట్ల బంగారాన్ని మాత్రమే విక్రయించడానికి అనుమతి ఉంటుందని ప్రమోద్ కుమారు తెలిపారు. బీఐఎస్ అధికారులు చెబుతున్న దాని ప్రకారం.. హాల్‌మార్క్ ఉండటం వల్ల బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు మోసపోకుండా ఉండేందుకు వీలవుతుంది.

Tags:    

Similar News