'చేతి వృత్తిదారులను ఆదుకోవాలి'
దిశ, న్యూస్‌బ్యూరో : చేతివృత్తిదారులు, దినసరి కూలీలు, వలస కూలీలను ఈ విపత్కర పరిస్థితుల నుంచి బయటపడేసేందుకు స్పష్టమైన ప్రభుత్వ ఆదేశాలు లేకపోవడం బాధాకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వలస కార్మికులను లాక్‌డౌన్ నుంచి ఆదుకునేందుకు గాను రూ.10 కోట్ల ప్యాకేజీని కేటాయించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని దినసరి కూలీలకు గ్రామీణ ఉపాధి పథకం కింద ఉపాధి కల్పించాలని కోరారు. అంతేకాకుండా కూలీలకు వెంట వెంటనే డబ్బులు […]
దిశ, న్యూస్‌బ్యూరో : చేతివృత్తిదారులు, దినసరి కూలీలు, వలస కూలీలను ఈ విపత్కర పరిస్థితుల నుంచి బయటపడేసేందుకు స్పష్టమైన ప్రభుత్వ ఆదేశాలు లేకపోవడం బాధాకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వలస కార్మికులను లాక్‌డౌన్ నుంచి ఆదుకునేందుకు గాను రూ.10 కోట్ల ప్యాకేజీని కేటాయించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని దినసరి కూలీలకు గ్రామీణ ఉపాధి పథకం కింద ఉపాధి కల్పించాలని కోరారు. అంతేకాకుండా కూలీలకు వెంట వెంటనే డబ్బులు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. కరోనా మూలంగా చేతివృత్తుల వారు ఉపాధి కోల్పోయి వీధిన పడే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. వీరి ఒక్కో కుటుంబానికి రూ.5000 చెల్లించి నిత్యావసర సరుకులు అందజేయాలని డిమాండ్ చేశారు.
Tags : Hand Professionals, Daily workers, CPI, Lock down, Chada Venkat Reddy