కరోనా సంక్షోభంలో ఉద్యోగులకు ఊరట!
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి వల్ల దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ తప్పనిసరి అయ్యింది. ఈ పరిణామాలతో తక్కువ జీతం ఉన్న ఉద్యోగులు తీవ్రమైన కష్టాలను ఎదుర్కొనక తప్పేలా లేదు. వీరందరికీ ఊరట ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ప్యాకేజీ కింద..సంఘటిత రంగంలో ఉన్న ఉద్యోగులకు ఎంప్లాయిస్ షేర్‌ను ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వందలోపు ఉద్యోగులున్న చిన్న సంస్థలకు మాత్రమే ఇది వర్తిస్తుందని, ఆయా […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి వల్ల దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ తప్పనిసరి అయ్యింది. ఈ పరిణామాలతో తక్కువ జీతం ఉన్న ఉద్యోగులు తీవ్రమైన కష్టాలను ఎదుర్కొనక తప్పేలా లేదు. వీరందరికీ ఊరట ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ప్యాకేజీ కింద..సంఘటిత రంగంలో ఉన్న ఉద్యోగులకు ఎంప్లాయిస్ షేర్‌ను ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వందలోపు ఉద్యోగులున్న చిన్న సంస్థలకు మాత్రమే ఇది వర్తిస్తుందని, ఆయా సంస్థల్లో ఎంప్లాయిస్ షేర్ ధర 12 శాతాన్ని మూడు నెలల పాటు ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు.
అంతేకాకుండా, ప్రావిడెంట్ ఫండ్ విత్‌డ్రా నిబంధనల్ని కూడా కేంద్రం మార్చింది. ఉద్యోగులు తమ పీఎఫ్ బ్యాలెన్స్‌లో మూడు నెలల వేతనాన్ని లేదంటే 75 శాతాన్ని విత్‌డ్రా చేయవచ్చు. ఈ రెండు విధానాల్లో ఏడి తక్కువ ఉంటే దాన్ని నాన్ రీఫండబుల్ అడ్వాన్స్‌గా విత్‌డ్రా చేసుకునుఏ అవకాశాన్ని ప్రభుత్వం ఇస్తోంది. దీనివల్ల సుమారు 5 కోట్ల మంది లబ్ది పొందుతారు. కరోనా సంక్షోభంలో ఎవరైనా ఉద్యోగులు నగదు లేక ఇబ్బందులు పడుతుంటే పీఎఫ్ ద్వారా సులభంగా నగదును విత్‌డ్రా చేసుకునే వీలుని ప్రభుత్వం ఇస్తోంది. ఇవి మాత్రమే కాకుండా గృహ నిర్మాణానికి, పెళ్లి వంటి కార్యాలకు ఇప్పటికే అడ్వాన్స్‌గా నగదు తీసుకునే వెసులుబాటు, సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది.
Tags : Epf Withdrawal Rules, Epf Account, Nirmala Sitharaman, Employer, Provident Fund Organisation, Epfo, Withdrawal Rules