పెన్షన్ రంగంలో ఎఫ్‌డీఐ పరిమితి పెంపుకు సిద్ధం

దిశ, వెబ్‌డెస్క్: పెన్షన్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) పరిమితిని 74 శాతానికి పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఈ రంగంలో 49 శాతం శాతం ఎఫ్‌డీఐ పరిమితి ఉండగా, దీన్ని 74 శాతానికి పెంచేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ దీనికి సంబంధించి పార్లమెంటు బిల్లు ఆమోదం లభిస్తే విదేశీ కంపెనీలు దేశీయ పెన్షన్ రంగంలో యాజమాన్య వాటాను దక్కించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఎఫ్‌డీఐ పరిమితిని పెంచేందుకు పెన్షన్ అండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అధారిటీ(పీఎఫ్ఆర్‌డీఏ) చట్టం-2013కి […]

Update: 2021-04-11 07:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: పెన్షన్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) పరిమితిని 74 శాతానికి పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఈ రంగంలో 49 శాతం శాతం ఎఫ్‌డీఐ పరిమితి ఉండగా, దీన్ని 74 శాతానికి పెంచేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ దీనికి సంబంధించి పార్లమెంటు బిల్లు ఆమోదం లభిస్తే విదేశీ కంపెనీలు దేశీయ పెన్షన్ రంగంలో యాజమాన్య వాటాను దక్కించుకునేందుకు అవకాశం ఉంటుంది.

ఎఫ్‌డీఐ పరిమితిని పెంచేందుకు పెన్షన్ అండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అధారిటీ(పీఎఫ్ఆర్‌డీఏ) చట్టం-2013కి ప్రభుత్వం సవరణ చేపట్టనుంది. వ్యూహాతమక్ రంగాలు మినహాయించి అన్ని విభాగాల్లో ఎఫ్‌డీఐ పరిమితిని కేంద్రం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇటీవలే బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని 74 శాతానికి పెంచింది. ఇప్పుడు పెన్షన్ రంగంలో ఈ పరిమితిని పెంచేందుకు చర్యలు మొదలుపెట్టింది. సంబంధిత వర్గాల నుంచి ఉన్న సమాచారం ప్రకారం..పెన్షన్ రంగంలో ఎఫ్‌డీఐల పరిమితిని 74 శాతానికి పెంచేందుకు ఈ చట్ట సవరణ బిల్లు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News