మరో ప్రభుత్వ రంగ సంస్థలో వాటా విక్రయానికి ఆహ్వానం!
దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ షిప్పింగ్ సంస్థ (షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)లో 63.75 శాతం వాటాను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వాటా మొత్తాన్ని కొనేందుకు ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానించింది. పెట్టుబడులకు ఆసక్తి వ్యక్తీకరణ(ఈఓఐ)ను దాఖలు చేసుకోవచ్చని మంగళవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ కోరింది. నిర్వహణ నియంత్రణ బదిలీతో పాటు ప్రైవేట్ వాటాలకు ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ విభాగం (దీపమ్) ఫిబ్రవరి 13, 2021 నాటికి బిడ్‌లను ఆహ్వానిస్తూ […]
దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ షిప్పింగ్ సంస్థ (షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)లో 63.75 శాతం వాటాను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వాటా మొత్తాన్ని కొనేందుకు ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానించింది. పెట్టుబడులకు ఆసక్తి వ్యక్తీకరణ(ఈఓఐ)ను దాఖలు చేసుకోవచ్చని మంగళవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ కోరింది. నిర్వహణ నియంత్రణ బదిలీతో పాటు ప్రైవేట్ వాటాలకు ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ విభాగం (దీపమ్) ఫిబ్రవరి 13, 2021 నాటికి బిడ్‌లను ఆహ్వానిస్తూ ప్రకటనను విడుదల చేసింది.
ప్రస్తుత మార్కెట్ ధరతో షిప్పింగ్ కార్పొరేషన్‌లో ప్రభుత్వం వాటా విలువ సుమారు రూ. 2,500 కోట్లు ఉంటుంది. నిజానికి, షిప్పింగ్ కార్పొరేషన్‌లో వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం గతేడాది నవంబర్‌లోనే ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలియజేసినప్పటికీ ఈ ఏడాది కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రక్రియ ఆలస్యమైంది. ఈ పెట్టుబడుల ప్రక్రియను నిర్వహించేందుకు ప్రభుత్వం ఆర్‌బీఎస్‌ఏ క్యాపిటల్ అడ్వైజర్స్ ఎల్‌ఎల్‌పీని సలహాదారుగా నియమించింది.