పప్పుశెనగ పర్చేస్‌కు రూ. 798 కోట్లు

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్ కొనసాగుతున్నందున రైతును ఆదుకునేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా రాష్ట్రంలో పండిన లక్షా 40వేల 975 టన్నుల పప్పుశెనగ (బెంగాల్ గ్రామ్) కొనుగోలుకు మార్క్‌ఫెడ్‌కు అనుమతి ఇచ్చింది. ఇందుకు అవసరమయ్యే రూ.798కోట్లకు మార్క్‌ఫెడ్‌కు బ్యాంకు గ్యారంటీ ఇచ్చింది. నేషనలైజ్డ్ బ్యాంకు లేదా ఇతర ఆర్థికసంస్థల నుంచి ఈ మొత్తానికి రుణం తీసుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్య‌కార్యదర్శి జనార్థన్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు […]

Update: 2020-04-27 08:41 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్ కొనసాగుతున్నందున రైతును ఆదుకునేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా రాష్ట్రంలో పండిన లక్షా 40వేల 975 టన్నుల పప్పుశెనగ (బెంగాల్ గ్రామ్) కొనుగోలుకు మార్క్‌ఫెడ్‌కు అనుమతి ఇచ్చింది. ఇందుకు అవసరమయ్యే రూ.798కోట్లకు మార్క్‌ఫెడ్‌కు బ్యాంకు గ్యారంటీ ఇచ్చింది. నేషనలైజ్డ్ బ్యాంకు లేదా ఇతర ఆర్థికసంస్థల నుంచి ఈ మొత్తానికి రుణం తీసుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్య‌కార్యదర్శి జనార్థన్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే కేంద్ర అనుమతి ఉన్న 47వేల600 టన్నుల పప్పు‌శెనగను మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసింది. కాగా, కేంద్ర కోటాకు మించి పొద్దు తిరుగుడు పంటను కొనుగోలు చేసేందుకు సైతం ప్రభుత్వం మార్క్ ఫెడ్‌కు అనుమతిచ్చింది. దీనికిగాను మార్క్‌ఫెడ్‌కు రూ.32.42 కోట్లకు బ్యాంకు గ్యారంటీ ఇస్తూ ప్రభుత్వం అనుమతిచ్చింది. తెల్ల జొన్నలకు మార్కెట్‌లో క్వింటాలుకు రూ.1200 నుంచి రూ.1500 మాత్రమే పలుకుతుండడంతో వాటి మద్దతు ధర రూ.2550కి కొనుగోలు చేసేందుకు మార్క్‌ఫెడ్‌కు మరో రూ.26 కోట్ల 3 లక్షలకు గ్యారంటీ ఇస్తూ వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

tags: telangana, bengal gram, jowar, sunflower, market, purchase, g.os

Tags:    

Similar News