ఎన్ఆర్ఐలకు ఎయిర్ఇండియాలో వందశాతం వాటా!

దిశ, వెబ్‌డెస్క్ : భరించలేని ఋణాలు, నష్టాలతో అమ్మకానికి సిద్ధమైన ఎయిర్ఇండియాలో ఎన్ఆర్ఐల పెట్టుబడుల పరిమితిని వంద శాతానికి పెంచాలని కేబినేట్ నిర్ణయం తీసుకుంది. అలాగే, విదేశీ ఎయిర్‌లైన్స్, విదేశీ సంస్థలు ఎయిర్ఇండియాలో ప్రత్యక్షంగానే కాకుండా, పరోక్షంగా కూడా 49 శాతం కంటే ఎక్కువ వాటాలను కొనకూడదని కేంద్ర స్పష్టం చేసింది. దీంతో ఎయిర్ఇండియా భారెతీయుల నియంత్రణలోనే ఉండేలా నిర్ణయం జరిగింది. ఇండియాలో వేరే ప్యాసింజర్ ఎయిర్‌లైన్స్‌లో ఎన్ఆర్ఐలు అటోమెటిక్ పద్ధతిలో వంద శాతం వాటాలను కొనడానికి […]

Update: 2020-03-05 05:11 GMT

దిశ, వెబ్‌డెస్క్ : భరించలేని ఋణాలు, నష్టాలతో అమ్మకానికి సిద్ధమైన ఎయిర్ఇండియాలో ఎన్ఆర్ఐల పెట్టుబడుల పరిమితిని వంద శాతానికి పెంచాలని కేబినేట్ నిర్ణయం తీసుకుంది. అలాగే, విదేశీ ఎయిర్‌లైన్స్, విదేశీ సంస్థలు ఎయిర్ఇండియాలో ప్రత్యక్షంగానే కాకుండా, పరోక్షంగా కూడా 49 శాతం కంటే ఎక్కువ వాటాలను కొనకూడదని కేంద్ర స్పష్టం చేసింది. దీంతో ఎయిర్ఇండియా భారెతీయుల నియంత్రణలోనే ఉండేలా నిర్ణయం జరిగింది.

ఇండియాలో వేరే ప్యాసింజర్ ఎయిర్‌లైన్స్‌లో ఎన్ఆర్ఐలు అటోమెటిక్ పద్ధతిలో వంద శాతం వాటాలను కొనడానికి అవకాశం ఉన్నప్పటికీ, ఎయిర్ఇండియాకు 49 శాతమే అనుమతులు ఉన్నాయి. ఈ నిర్ణయం ఎయిర్ఇండియా విషయంలో ప్రధాన మైలురాయి అని కేంద్ర మంత్రి జవదేకర్ అన్నారు. సంస్థ ప్రైవేటు వారి చేతుల్లోకి వెళ్లినప్పటికీ ప్రయాణీకులకు అందించే సేవల్లో లోటు ఉండదని, పెట్టుబడి అవకాశాలను పెంచుకునే వీలుందని ఆయన అన్నారు.

tags : FDI in Air India, Air India, FDI newsAir IndiadeloitteVistara

Tags:    

Similar News