ఎంఎస్ఎంఈలకు రుణ హామీ పథకం పొడిగింపు

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ మహమ్మారి వల్ల దెబ్బతిన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ) మద్దతుగా అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్(ఈసీఎల్‌జీఎస్)ను ప్రభుత్వం పొడిగిస్తున్నట్టు తెలిపింది. ఈ పొడిగింపు 2022, మార్చి 31 వరకు లేదంటే ఈ పథకం కింద రూ. 4.5 లక్షల కోట్ల హామీ నెరవేరే వరకు ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. ఈ పథకం కింద రుణ పంపిణీ ఆఖరి తేదీని 2022, జూన్ 30కి పొడిగించినట్టు మంత్రిత్వ […]

Update: 2021-09-29 09:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ మహమ్మారి వల్ల దెబ్బతిన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ) మద్దతుగా అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్(ఈసీఎల్‌జీఎస్)ను ప్రభుత్వం పొడిగిస్తున్నట్టు తెలిపింది. ఈ పొడిగింపు 2022, మార్చి 31 వరకు లేదంటే ఈ పథకం కింద రూ. 4.5 లక్షల కోట్ల హామీ నెరవేరే వరకు ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. ఈ పథకం కింద రుణ పంపిణీ ఆఖరి తేదీని 2022, జూన్ 30కి పొడిగించినట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇటీవల అర్హత కలిగిన రంగాలకు, వ్యాపారాలకు ఈ పథకం ద్వారా రుణ హామీ ఇవ్వాలని వివిధ పరిశ్రమల నుంచి డిమాండ్లను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రిత్వ శాఖ వివరించింది. కొవిడ్ మహమ్మారి సెకెండ్ వేవ్ కారణంగా ఎంఎస్ఎంఈ వ్యాపారాలకు అనుగుణంగా ఈ పథకంలో అనేక మార్పులు చేపట్టారు. ఈసీఎల్‌జీఎస్ 1.0, 2.0 కింద ఎలాంటి సహాయాన్ని పొందని వ్యాపారులు 2021, మార్చి 31 నాటికి 30 శాతం వరకు క్రెడిట్ మద్దతును పొందేందుకు అర్హత కలిగి ఉంటారు.

Tags:    

Similar News