ఈ ఆర్థిక సంవత్సరానికి వృద్ధి 7.7 శాతం ప్రతికూలత

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థికవ్యవస్థ 7.7 శాతం కుదించుకుపోయే అవకాశముందని జాతీయ గణాంకాల కార్యాలయం(ఎన్ఎస్ఓ) గురువారం తెలిపింది. 2019-20లో వృద్ధి రేటు 4.2 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. 2020-21లో వ్యవసాయ రంగం మినహా దాదాపు అన్ని రంగాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయని ఎన్ఎస్ఓ అభిప్రాయపడింది. ఎన్ఎస్ఓ అంచనాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) అంచనాలకు అనుగుణంగా ఉన్నాయి. 2020-21కి దేశ జీడీపీ 7.5 శాతం ప్రతికూల అంచనాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇదివరకు […]

Update: 2021-01-07 08:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థికవ్యవస్థ 7.7 శాతం కుదించుకుపోయే అవకాశముందని జాతీయ గణాంకాల కార్యాలయం(ఎన్ఎస్ఓ) గురువారం తెలిపింది. 2019-20లో వృద్ధి రేటు 4.2 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. 2020-21లో వ్యవసాయ రంగం మినహా దాదాపు అన్ని రంగాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయని ఎన్ఎస్ఓ అభిప్రాయపడింది. ఎన్ఎస్ఓ అంచనాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) అంచనాలకు అనుగుణంగా ఉన్నాయి. 2020-21కి దేశ జీడీపీ 7.5 శాతం ప్రతికూల అంచనాలను వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఇదివరకు సెప్టెంబర్ త్రైమాసికంలో దేశ ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడిన నేపథ్యంలో ఆర్‌బీఐ శాతం ప్రతికూలత నుంచి దీన్ని సవరించింది. రంగాల వారీగా, ఉత్పత్తి రంగం గతేడాది సానుకూలంగా నమోదైన తర్వాత ఈసారి 9.4 శాతం సంకోచించవచ్చని, వ్యవసాయ రంగం స్వల్పంగా తగ్గినప్పటికీ గత ఆర్థిక సంవత్సరం ఉన్న 4 శాతం నుంచి 3.4 శాతం సానుకూలంగా వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. మైనింగ్ 12.4 శాతం, హోటళ్లు 21.4 శాతం, రవాణా 3.1 శాతం, కమ్యూనికేషన్, సేవల రంగాలు 3.6 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేస్తాయని తెలిపింది. అదేవిధంగా విద్యుత్ రంగం గత ఆర్థిక సంవత్సరంలో 2.7 శాతం నుంచి 4.1 శాతం ప్రతికూలతను, ఆర్థిక సేవల రంగం 0.8 శాతం, ప్రజా సేవలు 3.7 శాతం ప్రతికూలంగా ఉండొచ్చని ఎన్ఎస్ఓ అంచనాలను వెల్లడించింది.

Tags:    

Similar News