ప్రభుత్వ ఉద్యోగిని పరిగెత్తించిన ‘మేక’.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

దిశ, వెబ్‌డెస్క్ : సాధారణంగా జంతువులు ఒక్కోసారి మనుషులను ముప్పు తిప్పలు పెట్టిస్తుంటాయి. తమ వెంట తిప్పుకుంటాయి లేదా ఆలసిపోయే వరకు పరిగెత్తిస్తుంటాయి. అయితే, జంతు ప్రేమికులు మాత్రం వాటికి ఎల్లప్పుడు సపోర్టు చేస్తూనే ఉంటారు. వాటికి ఏమీ తెలియదు కదా..? మనుషుల లాగా జంతువులకు ఆలోచన శక్తి ఉండదు. వాటికి ఆ టైంలో ఏది అనిపిస్తే అదే చేస్తుంటాయి. అవి ఏం చేసినా వాటిని కొట్టడం, హింసించడం వంటివి చేయరాదని వారు ముక్తకంఠంతో చెబుతుంటారు. తాజాగా […]

Update: 2021-12-03 11:56 GMT

దిశ, వెబ్‌డెస్క్ : సాధారణంగా జంతువులు ఒక్కోసారి మనుషులను ముప్పు తిప్పలు పెట్టిస్తుంటాయి. తమ వెంట తిప్పుకుంటాయి లేదా ఆలసిపోయే వరకు పరిగెత్తిస్తుంటాయి. అయితే, జంతు ప్రేమికులు మాత్రం వాటికి ఎల్లప్పుడు సపోర్టు చేస్తూనే ఉంటారు. వాటికి ఏమీ తెలియదు కదా..? మనుషుల లాగా జంతువులకు ఆలోచన శక్తి ఉండదు. వాటికి ఆ టైంలో ఏది అనిపిస్తే అదే చేస్తుంటాయి. అవి ఏం చేసినా వాటిని కొట్టడం, హింసించడం వంటివి చేయరాదని వారు ముక్తకంఠంతో చెబుతుంటారు. తాజాగా జరిగిన ఓ ఇన్సిడెంట్ మాత్రం అందరి చేత నవ్వులు పూయించింది. గురువారం వెలుగులోకి వచ్చిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎందుకంటే ఓ మేక ప్రభుత్వ ఉద్యోగిని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది. ఇంతకూ అది ఏం చేసిందంటే…

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ పట్టణంలో ఓ ప్రభుత్వ ఆఫీసు ఉంది. దాని చుట్టుపక్కల కుక్కలు, మేకలు ఇతర జంతువులు ఆహారం కోసం వెతుకులాట సాగిస్తుంటాయి. ఈ క్రమంలోనే ఓ మేక ఆహారం కోసం ఏకంగా ప్రభుత్వ కార్యాలయంలోని చౌబేపూర్ బ్లాక్‌లోకి ఎంటరైంది. అక్కడ టేబుల్ వద్ద ఉన్న పేపర్లను నోట కరుచుకుని బయటకు పరుగులు పెట్టింది. ఇంతలో ఆ మేకను చూసిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆ విలువైన పేపర్ల కోసం దాని వెంట పరిగెత్తాడు. ఆ ఉద్యోగి రన్నింగ్ చేస్తున్న క్రమంలో ‘ఆరేయ్ యార్ కాగజ్ దేదే’ (పేపర్లు ఇచ్చేయ్) అంటూ అరుస్తున్నాడు. ఈ దృశ్యాలను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో తెగ వైరలైంది. దీనిపై కొందరు తమకు తోచిన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News