NaBFID చైర్మన్‌గా కేవీ కామత్
దిశ, వెబ్‌డెస్క్: ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ప్రముఖ బ్యాంకర్ కేవీ కామత్‌ను కొత్తగా ఏర్పాటైన డెవలప్‌మెంట్ ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్ నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్‌కు చైర్మన్‌గా నియమించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభాగం ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఆత్మనిర్భర్ భారత్ స్కీమ్‌కు ఊతమిచ్చేందుకు నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్‌ను 20,000 కోట్ల రూపాయలతో కొత్తగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. చైర్మన్ […]
దిశ, వెబ్‌డెస్క్: ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ప్రముఖ బ్యాంకర్ కేవీ కామత్‌ను కొత్తగా ఏర్పాటైన డెవలప్‌మెంట్ ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్ నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్‌కు చైర్మన్‌గా నియమించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభాగం ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఆత్మనిర్భర్ భారత్ స్కీమ్‌కు ఊతమిచ్చేందుకు నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్‌ను 20,000 కోట్ల రూపాయలతో కొత్తగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. చైర్మన్ పదవికి KV కామత్‌ను నియమించడం భారత్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపమెంట్‌కు ఎంతో ఉపయోగపడుతుందని, భవిష్యత్తు భారత్‌కు ఇది ఊతమిస్తుందని ఆర్థిక శాఖ ట్వీట్ చేసింది. ఇందులో ఒక చైర్మన్, నలుగురు పూర్తికాల డైరెక్టర్లు మరియు ఇద్దరు ప్రభుత్వ నామినీలతో సహా మొత్తం 13 మంది సభ్యులతో కూడిన బోర్డును కలిగి ఉంటుంది. మిగిలినవి స్వతంత్రంగా ఉంటాయని వెల్లడించింది.
Govt appoints veteran banker K V Kamath as chairperson of NaBFID#KVKamath #NaBFIDhttps://t.co/QtUelW1Xvn
— Business Standard (@bsindia) October 27, 2021