మూడు రాజధానులకు గవర్నర్ అమోదం

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. దీంతో ఏపీ కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఉండనుంది. మూడు వారాల క్రితం ప్రభుత్వం బిల్లును గవర్నర్ కు పంపిన సంగతి తెలిసిందే. తాజాగా గవర్నర్ ఆమోదంతో మూడు రాజధానులకు లైన్ క్లియర్ అయింది. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను జూన్ 16న అసెంబ్లీ అమోదం తెలిపింది. అయితే శాసన మండలిలో ఈ […]

Update: 2020-07-31 05:44 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. దీంతో ఏపీ కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఉండనుంది. మూడు వారాల క్రితం ప్రభుత్వం బిల్లును గవర్నర్ కు పంపిన సంగతి తెలిసిందే. తాజాగా గవర్నర్ ఆమోదంతో మూడు రాజధానులకు లైన్ క్లియర్ అయింది.

రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను జూన్ 16న అసెంబ్లీ అమోదం తెలిపింది. అయితే శాసన మండలిలో ఈ బిల్లులపై ఎలాంటి చర్చ జరగకుండానే వాయిదా పడింది. అసెంబ్లీ ఆమోదం తెలపడంతో ప్రభుత్వం బిల్లులను గవర్నర్‌కు పంపింది. ఏపీ హైకోర్టులో రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ప్రస్తుతం ఈ పిటిషన్లు విచారణ దశలో ఉన్నాయి. అయితే గవర్నర్ అమోదం తెలపడంతో రాజధాని విషయంలో ప్రభుత్వం తన పంతాన్ని నెగ్గించుకుంది. వీలైనంత త్వరగా రాజధానిని విశాఖకు తరలించాలని ప్రభుత్వ వర్గాలు అనుకుంటున్నట్లు సమాచారం.

Tags:    

Similar News