సంస్థలకు కేంద్రం ఊరట!
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంస్థలకు కేంద్రం ఊరట కల్పించింది. ఆర్థిక నష్టాలను అధిగమిస్తూ ఎక్కువ మొత్తంలో దివాలాకు గురికాకుండా ఆరు నెలల వరకు సంస్థలకు ఉపశమన చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. దీనికి కేంద్ర కేబినెట్ అనుమతించింది. కొవిడ్-19 సమయంలో దివాలాకు సంబంధించి కొత్త డీఫాల్ట్ కేసులను నమోదు చేయదని ప్రభుత్వం వర్గాలు వెల్లడించాయి. 2016 ఇన్సాల్వెన్సీ అండ్ దివాలా కోడ్‌లో సవరణ చేస్తూ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేసిన సూచనల మేరకు కేంద్రం […]
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంస్థలకు కేంద్రం ఊరట కల్పించింది. ఆర్థిక నష్టాలను అధిగమిస్తూ ఎక్కువ మొత్తంలో దివాలాకు గురికాకుండా ఆరు నెలల వరకు సంస్థలకు ఉపశమన చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. దీనికి కేంద్ర కేబినెట్ అనుమతించింది. కొవిడ్-19 సమయంలో దివాలాకు సంబంధించి కొత్త డీఫాల్ట్ కేసులను నమోదు చేయదని ప్రభుత్వం వర్గాలు వెల్లడించాయి. 2016 ఇన్సాల్వెన్సీ అండ్ దివాలా కోడ్‌లో సవరణ చేస్తూ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేసిన సూచనల మేరకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే, కేంద్రానికి చిక్కొకటి ఉంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయానికి రాష్త్రపతి ఆమోదం ఇవ్వాల్సి ఉంది. రాష్త్రపతి కొత్త సెక్షన్ 10ఏ కు ఆమోదం తెలిపితే 7,9,10 సెక్షన్లను తాత్కాలిక పక్కన పెట్టనున్నట్టు తెలుస్తోంది. అయితే, సవరణ చేసిన నిబంధన ఏడాదికి మించి పొడిగించలేమని స్పష్టం చేసింది.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొవిడ్-19 వల్ల లాక్‌డౌన్ కష్టాలు, నష్టాల నుంచి ఉపశమనం లాంటిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో ఉన్న వ్యాపార వర్గాలకు ఇంకాస్త స్థిరత్వాన్ని ఇస్తుందని తెలిపారు. ఏదైనా సంస్థకు అవసరమైన రుణాలు, ఫైనాన్సింగ్ విషయాల గురించి చరించేందుకు, బ్యాంకుల నుంచి ఉపశమనాలను పొందేంద్నుకు అవకాశముంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఏప్రిల్ 30 దాటిన తర్వాత ఐబీసీ 2016 7,9, 10 సెక్షన్లు 6 నెలల కాలానికి సస్పెండ్ చేయడాన్ని పరిశీలిస్తామని కేంద్ర మంత్రి నిరంలా సీతారామన్ మార్చి 24న ప్రస్తావించిన సగతి తెలిసిందే.
Tags: amendments, defaults, government, IBC, insolvency proceedings