పాఠశాల పుస్తకాల కోసం నిధులు విడుదల

దిశ, తెలంగాణ బ్యూరో: పాఠశాల పుస్తకాలను కొనుగోళు చేసేందుకు ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. బడ్జెట్‌లో పాఠశాలల నిర్వహణ కోసం కేటాయించిన నిధుల నుంచి రూ.16,88,2300లను విడుదల చేసినట్టుగా పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. విద్యాసంస్థలు ప్రారంభం కావడంతో ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం పాఠాశాల విద్యార్ధులందరికి ఆన్ లైన్ ద్వారానే పాఠాలను బోధిస్తున్నారు. మొదటగా బ్రిడ్జి కోర్స్ ద్వారా గత ఏడాది పాఠాలు గుర్తుచేసే విధంగా భోదనలు కొనసాగుతున్నాయి. అనంతరం ఈ ఏడాది సిలబస్‌ను […]

Update: 2021-07-03 10:51 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పాఠశాల పుస్తకాలను కొనుగోళు చేసేందుకు ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. బడ్జెట్‌లో పాఠశాలల నిర్వహణ కోసం కేటాయించిన నిధుల నుంచి రూ.16,88,2300లను విడుదల చేసినట్టుగా పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. విద్యాసంస్థలు ప్రారంభం కావడంతో ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం పాఠాశాల విద్యార్ధులందరికి ఆన్ లైన్ ద్వారానే పాఠాలను బోధిస్తున్నారు. మొదటగా బ్రిడ్జి కోర్స్ ద్వారా గత ఏడాది పాఠాలు గుర్తుచేసే విధంగా భోదనలు కొనసాగుతున్నాయి. అనంతరం ఈ ఏడాది సిలబస్‌ను అధికారులు ప్రారంభించనున్నారు. నూతన సిలబస్ ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందించేందుకు అధికారులు తగిన ఏర్పాట్లను చేపట్టారు. పుస్తకాల కోసం కావాల్సిన నిధులను విడుదల చేసి సరైన సమయానికి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందించనున్నారు.

Tags:    

Similar News