మార్కెట్ విలువను పెంచింది అందుకేనా..?
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం గతేడాది ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.6,671 కోట్ల ఆదాయాన్ని అంచనా వేసింది. రూ. ఆరు వేల కోట్లు ఆర్జించింది. ఈ ఏడాది రూ.12,500 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేసింది. దీన్ని బట్టి రిజిస్ట్రేషన్ విలువలను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా సంక్షోభం, ధరణి పోర్టల్అమలు కోసం నాలుగు నెలల పాటు రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. అయినా, ఆశించిన రెవెన్యూ మాత్రం సాధించారు. క్రయ విక్రయాలు జోరందుకున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా […]
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం గతేడాది ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.6,671 కోట్ల ఆదాయాన్ని అంచనా వేసింది. రూ. ఆరు వేల కోట్లు ఆర్జించింది. ఈ ఏడాది రూ.12,500 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేసింది. దీన్ని బట్టి రిజిస్ట్రేషన్ విలువలను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా సంక్షోభం, ధరణి పోర్టల్అమలు కోసం నాలుగు నెలల పాటు రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. అయినా, ఆశించిన రెవెన్యూ మాత్రం సాధించారు. క్రయ విక్రయాలు జోరందుకున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా రియల్ఎస్టేట్ ఊపందుకున్నది. ఈ ఏడాది కూడా భూముల క్రయ విక్రయాల ద్వారానే అధిక ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ఆశిస్తోంది. ఈ మేరకు బడ్జెట్ప్రతిపాదనలను రూపొందించుకుంది.
ధరణి అమలుకు ముందే భూముల విలువలను పెంచాలని ప్రయత్నించారు. అప్పటికే ధరణి, తెలంగాణ భూ హక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం 2020, వీఆర్వో వ్యవస్థ రద్దు వంటి వాటితో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో మార్కెట్ విలువలను పెంచితే వ్యతిరేకత వస్తుందని భావించిది. ఇప్పుడు ఆర్ధిక పరిస్థితులు మెరుగయ్యాయని ప్రభుత్వం యోచిస్తోంది. కరోనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఆర్ధిక లావాదేవీలు యథాతథంగా సాగుతున్నాయని గుర్తించింది. ఈ క్రమంలో భూముల విలువలను బహిరంగ మార్కెట్కు అనుగుణంగా పెంచినా ఆందోళన వ్యక్తమయ్యే అవకాశాలు లేవని అధికారులు ప్రభుత్వానికి నివేదించిన తెలుస్తోంది.
కానీ, రిజిస్ట్రేషన్ల విలువలను పెరగడం ప్రభుత్వానికి భారంగా మారనుంది. ఇప్పటికే భూ సేకరణ ప్రక్రియ కొరకరాని కొయ్యగా మారింది. ప్రభుత్వం సేకరించిన భూములకు అతి తక్కువ నష్టపరిహారం ఇస్తోందంటూ రైతాంగం వ్యతిరేకిస్తోంది. ముచ్చర్ల ఫార్మా సిటీ వంటి ప్రాజెక్టుల్లో రైతులు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఇప్పుడేమో హైదరాబాద్చుట్టూ రీజినల్రింగు రోడ్డు ప్రాజెక్టును చేపట్టేందుకు బడ్జెట్లో గ్రీన్సిగ్నల్ఇచ్చింది. అందుకోసం నిధులను కూడా కేటాయించింది. ఈ క్రమంలో సాగు నీటి ప్రాజెక్టులు, ఆర్ఆర్ఆర్, రహదారి విస్తరణ, కాల్వలు.. ఇతర అనేక ప్రజాప్రయోజనాల కోసం భూ సేకరణ చేపట్టేందుకు మరింత ఆర్ధిక భారం పడనుంది.