గవర్నమెంట్‌ స్కూల్స్‌లో మధ్యాహ్న భోజన ధరలు పెంపు

దిశ, తెలంగాణ బ్యూరో: మధ్యాహ్న భోజనం ధరలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఒక్కో విద్యార్థికి చెల్లిస్తున్న ధరలకు అదనంగా 10.99శాతం ధరలను పెంచారు. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 4.48 చెల్లిస్తుండగా వీటిని రూ.4.97శాతానికి పెంచారు. అప్పర్, హైస్కూల్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 6.71చెల్లిస్తుండగా వీటిని రూ. 7.45కు పెంచారు. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ విద్యార్థులకు చెల్లించే ధరలో గుడ్డుకు అయ్యే ఖర్చును కూడా జమ చేశారు. 9, 10వ […]

Update: 2021-08-28 10:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మధ్యాహ్న భోజనం ధరలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఒక్కో విద్యార్థికి చెల్లిస్తున్న ధరలకు అదనంగా 10.99శాతం ధరలను పెంచారు. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 4.48 చెల్లిస్తుండగా వీటిని రూ.4.97శాతానికి పెంచారు. అప్పర్, హైస్కూల్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 6.71చెల్లిస్తుండగా వీటిని రూ. 7.45కు పెంచారు. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ విద్యార్థులకు చెల్లించే ధరలో గుడ్డుకు అయ్యే ఖర్చును కూడా జమ చేశారు. 9, 10వ తరగతి విద్యార్థులకు మాత్రం గుడ్డు అయ్యే ఖర్చుల కోసం అదనంగా రూ. 2లను చెల్లిస్తున్నారు. పెంచిన ధరలు 2020 మార్చి 1 నుంచి అమలవుతాయని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన తెలిపారు.

Tags:    

Similar News