భారత్‌లో గూగుల్ రూ.109 కోట్ల పెట్టుబడులు

దిశ, వెబ్‌డెస్క్ : భారత్‌లో సూక్ష్మ, చిన్న సంస్థలకు మద్ధతుగా సుమారు రూ. 109 కోట్ల పెట్టుబడులను పెట్టనున్నట్టు గూగుల్ తెలిపింది. ‘దేశీయంగా చిన్న, సూక్ష్మ సంస్థలకు మద్దతుగా ఈ పెట్టుబడులను పెడతాము. స్థానిక భాగస్వామ్యం కోసం చర్చలు జరుపుతున్నామని’ కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. గతేడాది కరోనా మహమ్మారి వల్ల గూగుల్ సంస్థ చిన్న వ్యాపారాలకు మద్దతుగా 800 మిలియన్ డాలర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా భారత్‌లో ఈ పెట్టుబడులను ప్రకటించింది. ‘అంతర్జాతీయంగా చిన్న వ్యాపారాలతో […]

Update: 2021-02-18 10:36 GMT

దిశ, వెబ్‌డెస్క్ : భారత్‌లో సూక్ష్మ, చిన్న సంస్థలకు మద్ధతుగా సుమారు రూ. 109 కోట్ల పెట్టుబడులను పెట్టనున్నట్టు గూగుల్ తెలిపింది. ‘దేశీయంగా చిన్న, సూక్ష్మ సంస్థలకు మద్దతుగా ఈ పెట్టుబడులను పెడతాము. స్థానిక భాగస్వామ్యం కోసం చర్చలు జరుపుతున్నామని’ కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. గతేడాది కరోనా మహమ్మారి వల్ల గూగుల్ సంస్థ చిన్న వ్యాపారాలకు మద్దతుగా 800 మిలియన్ డాలర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా భారత్‌లో ఈ పెట్టుబడులను ప్రకటించింది. ‘అంతర్జాతీయంగా చిన్న వ్యాపారాలతో గూగుల్ ప్రత్యేక సంబంధాన్ని కలిగి ఉంది.

ఆయా వ్యాపారాలు కొత్త వినియోగదారులను సాధించేందుకు, కొత్త ఆవిష్కరణలకు సహాయం చేస్తుంది. భారత్‌లో తాజా పెట్టుబడులను ప్రకటించిడం గర్వంగా ఉంది. దేశీయంగా కరోనా ప్రభావానికి గురైన వ్యాపారాలు కోలుకునేందుకు, పునరుద్ధరణకు అవసరమైన మూలధనాన్ని అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. గతేడాది గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, గూగుల్ ఫర్ ఇండియా డిజిటలైజేషన్ ఫండ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా రాబోయే 5-7 ఏళ్ల్లో రూ. 75 వేల కోట్ల పెట్టుబడులను గూగుల్ పెట్టనుంది.

Tags:    

Similar News