వినికిడి లోపమున్న వారి కోసం గూగుల్ కొత్త ఫీచర్లు
దిశ, వెబ్‌డెస్క్ : ఇంట్లో ఉండి ఫోన్ ఉపయోగిస్తున్నపుడు, వెనకాల డోర్ కొట్టిన శబ్దం అవుతుంటే, వినికిడి లోపం ఉన్నవాళ్లు గ్రహించలేకపోతారు. ఒకవేళ ఫైర్ అలారం మోగినా వారు గమనించకలేకపోతారు. ఇలాంటి అత్యవసర శబ్దాలను వినికిడి లోపం ఉన్న గ్రహించలేరు. ఎందుకంటే వారికి ఆ శబ్దం వినిపించదు కాబట్టి. కానీ వారు స్మార్ట్‌ఫోన్ వినియోగించగలరు. అందులో వస్తున్న మెసేజ్‌లు నోటిఫికేషన్‌లు చదవగలరు. ఈ ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని, తమ ఆండ్రాయిడ్ తాజా అప్‌డేట్‌లో గూగుల్ కొత్త యాక్సెసిబిలిటీ […]
దిశ, వెబ్‌డెస్క్ : ఇంట్లో ఉండి ఫోన్ ఉపయోగిస్తున్నపుడు, వెనకాల డోర్ కొట్టిన శబ్దం అవుతుంటే, వినికిడి లోపం ఉన్నవాళ్లు గ్రహించలేకపోతారు. ఒకవేళ ఫైర్ అలారం మోగినా వారు గమనించకలేకపోతారు. ఇలాంటి అత్యవసర శబ్దాలను వినికిడి లోపం ఉన్న గ్రహించలేరు. ఎందుకంటే వారికి ఆ శబ్దం వినిపించదు కాబట్టి. కానీ వారు స్మార్ట్‌ఫోన్ వినియోగించగలరు. అందులో వస్తున్న మెసేజ్‌లు నోటిఫికేషన్‌లు చదవగలరు. ఈ ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని, తమ ఆండ్రాయిడ్ తాజా అప్‌డేట్‌లో గూగుల్ కొత్త యాక్సెసిబిలిటీ ఫీచర్స్ తీసుకొచ్చింది. చుట్టుపక్కల శబ్దాలను వినలేని వారి కోసం ఈ ఫీచర్స్ ఉపయోగపడనున్నాయి.
కుక్కర్, మైక్రోవేవ్ ఓవెన్ లాంటి పరికరాలు చేసే అలారం శబ్దాలు, నల్లా నుంచి నీరు పడుతున్న శబ్దం, డోర్ కొడుతున్న శబ్దాలతో పాటు కుక్కలు మొరిగిన శబ్దాన్ని కూడా స్మార్ట్‌ఫోన్ గుర్తిస్తుంది. ఈ శబ్దాలను గుర్తించడానికి మైక్రోఫోన్‌ను ఉపయోగిస్తుంది. ఆ శబ్దాలు గుర్తించిన వెంటనే వైబ్రేషన్ లేదా కెమెరా లైట్ మిణుకుమనిపించడంతో పాటు ఒక పుష్ నోటిఫికేషన్ కూడా పంపిస్తుంది. ఈ ఫీచర్ పనిచేయాలంటే మైక్రోఫోన్ నిరంతరం ఆన్‌లో ఉండాలి. ఇలా చేయడం వల్ల బ్యాటరీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి, అవసరం ఉన్నపుడే ఆన్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. స్మార్ట్‌వాచ్ కూడా అనుసంధానం చేసుకునే సదుపాయం ఉంది కాబట్టి నిద్రపోయినప్పుడు అప్రమత్తంగా ఉంచడానికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది.