పిల్లల కోసం "గూగుల్ కిడ్స్ స్పేస్"
దిశ వెబ్‌డెస్క్: పిల్లల కోసం గూగుల్ సరికొత్త యాప్‌ను పరిచయం చేస్తోంది. ఆండ్రాయిడ్ టాబ్లెట్లలో “గూగుల్ కిడ్స్ స్పేస్” మోడ్‌ను అందిస్తోంది. దీంతో పిల్లలు నేర్చుకునేందుకు బుక్స్, వీడియోలు ఉంటాయి. ఈ ఫీచర్ మొదట లెనోవా స్మార్ట్ టాబ్ M10 HD Gen 2లో ప్రారంభం కాగా, త్వరలో మరిన్ని ఆండ్రాయిడ్ టాబెట్లలకు రానుంది. కిడ్స్ స్పేస్ పిల్లల కోసం వారు వెతికే ఆసక్తుల ఆధారంగా.. వారికి నాణ్యమైన, అనుకూలమైన కంటెంట్‌ను అందిస్తోంది. జనాదరణ పొందిన పిల్లల […]
దిశ వెబ్‌డెస్క్: పిల్లల కోసం గూగుల్ సరికొత్త యాప్‌ను పరిచయం చేస్తోంది. ఆండ్రాయిడ్ టాబ్లెట్లలో “గూగుల్ కిడ్స్ స్పేస్” మోడ్‌ను అందిస్తోంది. దీంతో పిల్లలు నేర్చుకునేందుకు బుక్స్, వీడియోలు ఉంటాయి. ఈ ఫీచర్ మొదట లెనోవా స్మార్ట్ టాబ్ M10 HD Gen 2లో ప్రారంభం కాగా, త్వరలో మరిన్ని ఆండ్రాయిడ్ టాబెట్లలకు రానుంది.
కిడ్స్ స్పేస్ పిల్లల కోసం వారు వెతికే ఆసక్తుల ఆధారంగా.. వారికి నాణ్యమైన, అనుకూలమైన కంటెంట్‌ను అందిస్తోంది. జనాదరణ పొందిన పిల్లల పుస్తకాలను ఉచితంగా చదవడానికి ఆయా ప్రచురణకర్తలతో కలిసి పనిచేసింది. దీంతో గూగుల్ కిడ్స్ స్పేస్ ద్వారం 400 ఉచిత పుస్తకాలను అందిస్తోంది.