ఇంటి నుంచే తరగతులు.. గూగుల్, యూట్యూబ్ టూల్స్
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్‌ను కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా అందర్నీ ఇంటి దగ్గర ఉండాలని వివిధ దేశాల ప్రభుత్వాలు ఆదేశిస్తున్నాయి. ఇందులో భాగంగా విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. వారితో పాటు టీచర్లు, తల్లిదండ్రులకు కూడా ఉపయోగపడేలా టెక్ దిగ్గజం గూగుల్, యూట్యూబ్ కంపెనీలు ఇంటర్నెట్ టూల్స్‌ని ఆవిష్కరించాయి. టీచ్ ఫ్రమ్ హోమ్ పేరుతో గూగుల్, లెర్న్ ఎట్ హోమ్ పేరుతో యూట్యూబ్ రెండు కొత్త ఫీచర్లను విడుదల చేశాయి. కోవిడ్ కారణంగా ఇళ్లలోన పాఠాలు నేర్చుకునే […]
దిశ, వెబ్‌డెస్క్:
కరోనా వైరస్‌ను కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా అందర్నీ ఇంటి దగ్గర ఉండాలని వివిధ దేశాల ప్రభుత్వాలు ఆదేశిస్తున్నాయి. ఇందులో భాగంగా విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. వారితో పాటు టీచర్లు, తల్లిదండ్రులకు కూడా ఉపయోగపడేలా టెక్ దిగ్గజం గూగుల్, యూట్యూబ్ కంపెనీలు ఇంటర్నెట్ టూల్స్‌ని ఆవిష్కరించాయి. టీచ్ ఫ్రమ్ హోమ్ పేరుతో గూగుల్, లెర్న్ ఎట్ హోమ్ పేరుతో యూట్యూబ్ రెండు కొత్త ఫీచర్లను విడుదల చేశాయి.
కోవిడ్ కారణంగా ఇళ్లలోన పాఠాలు నేర్చుకునే సదుపాయాన్ని ఈ ఫీచర్లు అందించనున్నాయి. వీటి ద్వారా ఇంటి నుంచే ఆఫీసు పని చేస్తున్న తల్లిదండ్రులకు తమ పిల్లలకు పాఠాలు నేర్పించే అవకాశం కలుగుతుంది. గూగుల్ టీచ్ ఫ్రమ్ హోమ్ ద్వారా గూగుల్ ఉత్పత్తులన్నింటిని ఎడ్యుకేటర్లు వినియోగించుకోవచ్చు. గూగుల్ మీట్ ద్వారా విద్యార్థులతో వీడియో చాట్ చేయొచ్చు. గూగుల్ ఫామ్స్ ద్వారా హోంవర్క్ ఇవ్వొచ్చు. అలాగే గూగుల్ క్లాస్‌రూం ద్వారా వీడియో పాఠాలు లైవ్ స్ట్రీమ్ చేయొచ్చు. అయితే ఇది విరివిగా ఉపయోగంలోకి వచ్చే కొద్దీ మరిన్ని ఫీచర్లను అనుసంధానం చేస్తామని గూగుల్ ప్రకటించింది. ప్రస్తుతానికి ఈ సర్వీసు ఇంగ్లీషు మాట్లాడేవారికి మాత్రమే అందుబాటులో ఉంది.
ఇక యూట్యూబ్ సంస్థ ఖాన్ అకాడమీ భాగస్వామ్యంతో లెర్న్ ఎట్ హోమ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో ప్రోగ్రామింగ్ నుంచి సైన్స్ పాఠాల వరకు అన్ని నేర్పించే యూట్యూబ్ ఛానళ్లను భాగం చేసింది. ఇందుకోసం ఖాన్ అకాడమీ మొదట 1 మిలియన్ డాలర్ల గ్రాంటు అందించి ముందు ముందు 50 మిలియన్ల డాలర్లు అందజేస్తామని గూగుల్ పేర్కొంది.
Tags : Google, Youtube, Learn@Home, Teach from home, live stream, work from home, corona