గూగుల్‌కు పోలీసుల రిక్వెస్ట్.. ప్లే స్టోర్ నుంచి ఆ యాప్స్ ఔట్

దిశ, వెబ్‌డెస్క్ :ఆన్‌లైన్ మనీ లెండింగ్ యాప్స్‌పై తెలంగాణ పోలీసులు దృష్టి సారించారు. ఇటీవల కాలంలో ఈసీ మనీ కోసం నేటి యువత మరియు పలువురు ఆన్ లైన్ మనీ యాప్స్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇన్‌స్టంట్ రుణాలు ఇస్తున్న ఈ యాప్స్ ఆ తర్వాత రెట్టింపు డబ్బులు వసూలు చేస్తున్నారు. అది తీర్చలేక ఇటీవల కాలంలో కొందరు ఆత్మహత్యలకు సైతం పాల్పడ్డారు. అంతేకాకుండా ఈ యాప్స్ వలన ఫ్రాడ్ ఎక్కువగా జరుగుతుందని గుర్తించిన పోలీసులు వాటిని ప్లే […]

Update: 2021-01-16 20:54 GMT

దిశ, వెబ్‌డెస్క్ :ఆన్‌లైన్ మనీ లెండింగ్ యాప్స్‌పై తెలంగాణ పోలీసులు దృష్టి సారించారు. ఇటీవల కాలంలో ఈసీ మనీ కోసం నేటి యువత మరియు పలువురు ఆన్ లైన్ మనీ యాప్స్‌పై
ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇన్‌స్టంట్ రుణాలు ఇస్తున్న ఈ యాప్స్ ఆ తర్వాత రెట్టింపు డబ్బులు వసూలు చేస్తున్నారు. అది తీర్చలేక ఇటీవల కాలంలో కొందరు ఆత్మహత్యలకు సైతం పాల్పడ్డారు. అంతేకాకుండా ఈ యాప్స్ వలన ఫ్రాడ్ ఎక్కువగా జరుగుతుందని గుర్తించిన పోలీసులు వాటిని ప్లే స్టోర్ నుంచి తొలగించాల్సిందిగా గూగుల్ కంపెనీకి విజ్ఞప్తి చేశారు.

ఈ నేపథ్యంలోనే ప్లే స్టోర్ నుంచి 200లకు పైగా పలు లోన్ యాప్స్‌ను గూగుల్ తొలగించడం మొదలు పెట్టింది. అయితే, మరో 450 యాప్స్‌ను కూడా తొలగించాలని పోలీసులు గూగుల్‌ను కోరారు. అంతేకాకుండా వాటికి సంబంధించిన వందల సంఖ్యలో బ్యాంకు అకౌంట్లతో పాటు ఇప్పటివరకు రూ.450కోట్ల నగదు ఫ్రీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆన్‌లైన్ రుణాల వ్యవహారంలో ఇప్పటివరకు నలుగురు చైనా దేశస్తులను అరెస్టు చేశామన్నారు. కాగా, ఆన్‌లైన్ లోన్ యాప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags:    

Similar News