అన్నార్తులకు షెల్టర్, ఫుడ్ వెతికిపెట్టే గూగుల్ మ్యాప్
దిశ వెబ్ డెస్క్: కరోనా నేపథ్యంలో దేశమంతా లాక్ డౌన్ కొనసాగుతోంది. మన రాష్ట్రంలోనూ ఏప్రిల్ 15వరకు లాక్ డౌన్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే అందరూ ఇల్లకే పరిమితం అయ్యారు. ఎంతో మంది పని కోల్పోయారు. హోటళ్లు, రెస్టారెంట్లు అన్నీ మూతపడ్డాయ్. పెళ్లిల్లు కూడా వాయిదా పడ్డాయ్. దీంతో అనాథలకు, రోడ్లపై జీవించేవారికి, భిక్షగాళ్లకు, దినసరి కూలీలకు ఆహారం దొరకడం లేదు. వారి కోసం ఇప్పటికే చాలా మంది ఆహారం అందిస్తున్నారు. అన్నపూర్ణ క్యాంటిన్(రూ. 5 […]
దిశ వెబ్ డెస్క్: కరోనా నేపథ్యంలో దేశమంతా లాక్ డౌన్ కొనసాగుతోంది. మన రాష్ట్రంలోనూ ఏప్రిల్ 15వరకు లాక్ డౌన్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే అందరూ ఇల్లకే పరిమితం అయ్యారు. ఎంతో మంది పని కోల్పోయారు. హోటళ్లు, రెస్టారెంట్లు అన్నీ మూతపడ్డాయ్. పెళ్లిల్లు కూడా వాయిదా పడ్డాయ్. దీంతో అనాథలకు, రోడ్లపై జీవించేవారికి, భిక్షగాళ్లకు, దినసరి కూలీలకు ఆహారం దొరకడం లేదు. వారి కోసం ఇప్పటికే చాలా మంది ఆహారం అందిస్తున్నారు. అన్నపూర్ణ క్యాంటిన్(రూ. 5 భోజన శాలలు) లు కూడా తెరుస్తున్నారు. అయితే ఇంకా ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నారు. ఆహారమనే కాదు.. కొంతమందికి ఉండటానికి షెల్టర్ కూడా దొరకడం లేదు. లాక్‌డౌన్ కారణంగా షెల్టర్ లేకుండా ఇబ్బంది పడుతున్న వారి కోసం గూగుల్ మ్యాప్స్ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
లాక్ డౌన్ చాలా మందికి తినడానికి తిండి లేకుండా, ఉండటానికి నిలువ నీడ లేకుండా చేసింది. కరోనా ఒకరి నుంచి ఒకరికి సోకుతుండటం వల్ల అందరూ విధిగా భౌతిక దూరం పాటించాల్సిందిగా ప్రభుత్వాలు చెబుతున్నాయి. దీంతో రోడ్లపై, రైలు, బస్ స్టేషన్లలో నిద్రించే వాళ్లందరికీ ఉండటానికి షెల్డర్ లేకుండా పోయింది. అంతేకాదు వారికి తినడానికి తిండి కూడా దొరకడం లేదు. ఈ రెండు సమస్యలకు పరిష్కారంగా ‘గూగుల్ మ్యాప్స్’లో గూగుల్ ఓ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. మన చుట్టుపక్కల ఉన్న పబ్లిక్ ఫుడ్ షెల్టర్లు, పబ్లిక్ నైట్ షెల్టర్ల సమాచారాన్ని ఇది తెలియజేస్తుంది. తమ స్మార్ట్‌ఫోన్లలో గూగుల్ మ్యాప్స్ యాప్ కలిగి ఉన్న వారు తమ చుట్టపక్కల ఉన్న పబ్లిక్ ఫుడ్ షెల్టర్లు, పబ్లిక్ నైట్ షెల్టర్లకు సంబంధించిన వివరాలను సెర్చ్ చేసుకుని తెలుసుకోవచ్చు. గూగుల్ సెర్చింజిన్, గూగుల్ అసిస్టెంట్‌లోనూ ఈ సదుపాయం అందుబాటులో ఉన్నట్టు గూగుల్ తెలిపింది. స్మార్ట్‌ఫోన్లు, కై ఓఎస్ ఆధారిత జియో వంటి ఫీచర్ ఫోన్లలోనూ ఈ ఫీచర్ అందుబాటులో ఉన్నట్టు పేర్కొంది. ప్రస్తుతం 30 నగరాల్లో ఇంగ్లిష్‌లో ఇది అందుబాటులో ఉంది. త్వరలోనే హిందీలోనూ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గూగుల్ ప్రయత్నిస్తోంది.
Tags: coronavirus, lockdown, shelter, food, google maps, new feature