సింగరేణి కార్మికులకు శుభవార్త..
దిశ, వెబ్ డెస్క్ : సింగరేణి కార్మికులకు శుభవార్త. రాష్ట్రంలోని సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు త్వరలో ఉచితంగా కరోనా టీకా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సింగరేణి ఆస్పత్రులను సిద్దం చేయాలని సూచించింది. వ్యాక్సిన్ వేసేందుకు సింగరేణి ఏరియాల్లోని ఆస్పత్రులు, డిస్పెన్సరీలను సిద్ధం చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ లేఖ రాసింది. వ్యాక్సినేషన్ కోసం ఏరియా ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సింగరేణి ప్రధాన వైద్యాధికారి డాక్టర్ మంత శ్రీనివాస్ తెలిపారు. రిజిస్ట్రేషన్ […]
దిశ, వెబ్ డెస్క్ : సింగరేణి కార్మికులకు శుభవార్త. రాష్ట్రంలోని సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు త్వరలో ఉచితంగా కరోనా టీకా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సింగరేణి ఆస్పత్రులను సిద్దం చేయాలని సూచించింది. వ్యాక్సిన్ వేసేందుకు సింగరేణి ఏరియాల్లోని ఆస్పత్రులు, డిస్పెన్సరీలను సిద్ధం చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ లేఖ రాసింది.
వ్యాక్సినేషన్ కోసం ఏరియా ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సింగరేణి ప్రధాన వైద్యాధికారి డాక్టర్ మంత శ్రీనివాస్ తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ కార్డుతో పాటు కంపెనీ ఇచ్చిన వైద్య గుర్తింపు కార్డును తీసుకురావాలని ఆయన సూచించారు.