బైక్ కొనడానికి డబ్బులు లేవా.. అయితే మీకోసమే ఈ శుభవార్త
దిశ, వెబ్‌డెస్క్ : కొత్తగా బైక్ కొనాలనుకుంటున్నారా..? దానికి మీ దగ్గర సరిపోను డబ్బులు లేవా..? అయితే మీరు బాధపడాల్సిన పనిలేదు. ఈ మంచి ఆఫర్ మీ కోసమే. తక్కువ వడ్డీకి బ్యాంక్ నుంచి టూవీలర్ లోన్ తీసుకొని మీకు కావలసిస బైక్ లేదా స్కూటర్‌ను కొనక్కొవచ్చు. ఈమధ్య కాలంలో బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుకే సులభంగా టూవీలర్ రుణాలు ఇస్తున్నాయి. మరి ఎందుకు ఆలస్యం.. ఏ బ్యాంక్ ఎలాంటి లోన్ ఇస్తుందో తెలుసుకుందాం..! * అన్ని […]
దిశ, వెబ్‌డెస్క్ : కొత్తగా బైక్ కొనాలనుకుంటున్నారా..? దానికి మీ దగ్గర సరిపోను డబ్బులు లేవా..? అయితే మీరు బాధపడాల్సిన పనిలేదు. ఈ మంచి ఆఫర్ మీ కోసమే. తక్కువ వడ్డీకి బ్యాంక్ నుంచి టూవీలర్ లోన్ తీసుకొని మీకు కావలసిస బైక్ లేదా స్కూటర్‌ను కొనక్కొవచ్చు. ఈమధ్య కాలంలో బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుకే సులభంగా టూవీలర్ రుణాలు ఇస్తున్నాయి. మరి ఎందుకు ఆలస్యం.. ఏ బ్యాంక్ ఎలాంటి లోన్ ఇస్తుందో తెలుసుకుందాం..!
* అన్ని బ్యాంకుల కంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా తక్కువ వడ్డీకే టూవీలర్ లోన్ అందిస్తోంది. వడ్డీ రేటు 6.85 శాతం నుంచి మెుదలవుతుంది. రూ.లక్ష లోన్‌కు రూ.3081 నుంచి గరిష్టంగా రూ.3320 వరకు వడ్డీ ఉంటుంది. రుణ పరిమితి కాలం మూడేళ్లు ఉంటుంది.
* సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.25శాతం వడ్డీరేటును అందిస్తుంది.
* కెనరా బ్యాంక్‌లో టూవీలర్ వడ్డీ రేటు 9శాతంగా ఉంది.
* హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో 12 శాతం వరకు వడ్డీ ఉంది.
* యూనియన్ బ్యాంక్‌లో వడ్డీ రేటు 9.9 శాతంగా ఉంది.
* దేశీయ అతి పెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వడ్డీ రేటు 10.25 శాతంగా ఉంది.