ఈ పంట పండిస్తే మీ ఇంట బంగారం పండినట్టే
దిశ, కుత్బుల్లాపూర్ : చెర్రీ టొమాటో అంటే తక్కువగా ఆసక్తి చూపుతామనేది మనందిరికి తెలుసు. కానీ, చెర్రీ సాగుతో రైతులకు ఎంతో ప్రయోజనమని అధికారులు తెలుపుతున్నారు. రైతుల్లో అవగాహన కల్పించేందుకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అధికారులు పాలీ హౌజ్‌లో శీజ, రోజ కంపెనీలకు చెందిన సాగు ప్రయోగాత్మకంగా చేస్తున్న సత్ఫలితాలిస్తుంది. అయితే ఈ చెర్రీని సాధారణంగా వంటల్లో కాకుండా హైఫై హోటళ్లు, రెస్టారెంట్లలో ఉపయోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం గుండ్రని చెర్రీ కాకుండా […]
దిశ, కుత్బుల్లాపూర్ : చెర్రీ టొమాటో అంటే తక్కువగా ఆసక్తి చూపుతామనేది మనందిరికి తెలుసు. కానీ, చెర్రీ సాగుతో రైతులకు ఎంతో ప్రయోజనమని అధికారులు తెలుపుతున్నారు. రైతుల్లో అవగాహన కల్పించేందుకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అధికారులు పాలీ హౌజ్‌లో శీజ, రోజ కంపెనీలకు చెందిన సాగు ప్రయోగాత్మకంగా చేస్తున్న సత్ఫలితాలిస్తుంది. అయితే ఈ చెర్రీని సాధారణంగా వంటల్లో కాకుండా హైఫై హోటళ్లు, రెస్టారెంట్లలో ఉపయోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం గుండ్రని చెర్రీ కాకుండా కోడి గుడ్డు ఆకారంలో, బంగారు, ఎర్ర రంగు సాగును చేస్తున్నారు.
ఈ పంట పెట్టాలనుకుంటే..
ఒక ఎకరం భూమిలో పాలీ హౌజ్‌లో కాకుండా ఓపెన్ భూమిలో పది వేల మొక్కలు పెట్టుకోవచ్చు. మొక్కలకు ఇరువైపు రెండు ఫీట్ల వెడల్పుతో నాటాలి. విత్తనాలకు రూ.10 వేలు, కూలీలకు రూ.1 లక్ష, విత్తనాలు, ఎరువులు, న్యూట్రీషియన్స్ కు రూ.1 లక్షతో పాటు మరో రూ.10 వేల ఖర్చవుతుంది.
సాగు చేసే విధానం…
మొక్కను నాటిన మూడో రోజు నుంచి వేరు తెగులు రాకుండా బారిస్టిన్(కార్బండిజం) అనే మందులను లీటర్ నీటికి 0.5 గ్రాములుకలిపి వేర్ల వద్ద చల్లాలి. ముడతలు రాకుండా ఒక లీటర్ నీటిలో 0.5 మి.లీ ఒబెరాన్ , కాన్ఫిడార్ మందును కలిపి స్ప్రే చేయాలి. అదే విధంగా మొక్కకు తెగులు రాకుండా ఉండేందుకు 191919, 05234, క్యాల్షియం నైట్రేట్, మైక్రో న్యూట్రిషియన్ నిత్యం వేస్తుండాలి. కాయలు వృద్ధి చెందేందుకు 13045, 0050 అనే మందులు వేయాల్సి ఉంటుంది.
ఎకరాకు రూ.20 లక్షలకు పైగా ఆదాయం..
ఎకరం భూమిలో పాదులు చేసి రెండు ఫీట్ల వెడల్పులో పది వేల మొక్కలు నాటాలి. నాటిన 70 నుంచి 75 రోజుల్లో మొక్క పెరిగికాపుకు వస్తుంది. అంతకు ముందు విరివిగా వచ్చే కొమ్మలను తొలగించి మొక్క పెరిగేందుకు పందిరి వేసి దారాలు కట్టుకోవాలి. ఒకటే కొమ్మ ద్వారా మొక్క ఆకృతిని చేయాలి. 14 ఫీట్ల వరకు పెరిగే మొక్కతో తెంపేందుకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశమున్నందున మొక్కను వంచి పెంచాల్సి ఉంటుంది. ఇలా 6 నుంచి 8 నెలల వరకు కాపు వస్తుంది. ఒక కిలో చెర్రీ టొమాటో రూ.150 ల నుంచి రూ.200 లకు పైగా ధర పలుకుతుంది. ఇలా ఎకరం భూమిలో మనకు రూ.20 లక్షల వరకు రాబడి వస్తుంది.
ఆసక్తి గల వారికి శిక్షణ
ఎంతో మంది వ్యవసాయం చేసేందుకే ప్రస్తుతం ఎక్కువగా ఇష్టపడుతున్నారు. నగరంలో స్థిరపడిన వారు కూడా ఊరిలో పంటలు పండిస్తున్నారు. చెర్రీ టొమాటో వల్ల ప్రయోజనమున్నందున సాగు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఆసక్తి గల వారికి సీఓఈలో శిక్షణను సైతం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాము. వివరాలకు : 9391458664 నెంబర్ లో సంప్రదించవచ్చు.