దిగొస్తున్న బంగారం!
దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ పరిణామాలతో దేశీయంగా ఈక్విటీ మార్కెట్లు పుంజుకున్నాయి. సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో షేర్లు, కరెన్సీలపైనే పెట్టుబడులు అధికంగా ఉంటాయనే సంకేతాలతో బంగారం ధరలు తగ్గుతున్నాయి. అంతేకాకుండా కరోనా వైరస్ విషయంలో భయాలు బంగారం డిమాండ్‌ను తగ్గిస్తాయనే ఆందోళన మార్కెట్ వర్గాల్లో అధికంగా ఉంది. మంగళవారం ఎమ్‌సీఎక్స్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ. 490 తగ్గి రూ. 43,348 గా ఉంది. వెండి కూడా పసిడి బాటలోనే రూ. 375 క్షీణించి రూ. […]
దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ పరిణామాలతో దేశీయంగా ఈక్విటీ మార్కెట్లు పుంజుకున్నాయి. సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో షేర్లు, కరెన్సీలపైనే పెట్టుబడులు అధికంగా ఉంటాయనే సంకేతాలతో బంగారం ధరలు తగ్గుతున్నాయి. అంతేకాకుండా కరోనా వైరస్ విషయంలో భయాలు బంగారం డిమాండ్‌ను తగ్గిస్తాయనే ఆందోళన మార్కెట్ వర్గాల్లో అధికంగా ఉంది.
మంగళవారం ఎమ్‌సీఎక్స్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ. 490 తగ్గి రూ. 43,348 గా ఉంది. వెండి కూడా పసిడి బాటలోనే రూ. 375 క్షీణించి రూ. 39,415 కి చేరింది. కరోనా కేసులు పెరుగుతుండటం, తదనంతర పరిణామాలతో మెటల్ బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయని కమొడిటీ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Tags: gold price, gold rate, silver