దిగొస్తున్న బంగారం.. 10 గ్రాములు రూ.46 వేలు!
దిశ, వెబ్‌డెస్క్ : దేశీయంగా మార్కెట్ల పరిణామాల కారణంగా రూ.50 వేల ఎగువకు దూసుకెళ్లిన బంగారం నెమ్మదిగా నేలచూపులు చూస్తోంది. గత కొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి మంగళవారం రూ.45 వేలకు చేరువకు వచ్చేసింది. గతేడాది కరోనా ప్రభావంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో రికార్డు స్థాయికి చేరిన తర్వాత ప్రస్తుతం రూ. 11 వేలకు పైగా తగ్గింది. మంగళవారం నాటి ధరలను పరిశీలిస్తే.. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములు రూ. 1,040 తగ్గి రూ. […]
దిశ, వెబ్‌డెస్క్ : దేశీయంగా మార్కెట్ల పరిణామాల కారణంగా రూ.50 వేల ఎగువకు దూసుకెళ్లిన బంగారం నెమ్మదిగా నేలచూపులు చూస్తోంది. గత కొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి మంగళవారం రూ.45 వేలకు చేరువకు వచ్చేసింది. గతేడాది కరోనా ప్రభావంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో రికార్డు స్థాయికి చేరిన తర్వాత ప్రస్తుతం రూ. 11 వేలకు పైగా తగ్గింది. మంగళవారం నాటి ధరలను పరిశీలిస్తే.. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములు రూ. 1,040 తగ్గి రూ. 45,930 కి చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 950 క్షీణించి రూ. 42,100 కు చేరుకుంది. వెండి కూడా బంగారం బాటలోనే రూ. 1,300 తగ్గి రూ. 72,000కు చేరుకుంది.
రూపాయి మారకం విలువ బలపడటం, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు క్షీణించడంతో దేశీయంగా పసిడి ధరలు తగ్గుతున్నాయని మార్కెట్ నిపుణులు తెలిపారు. అమెరికా పార్లమెంట్ భారీగా ఆర్థిక ప్యాకేజీకి ఆమోదం తెలిపిన నేపథ్యంలో ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని నిపుణులు భావిస్తున్నారు. దీని ప్రభావం బంగారంతో పాటు ఈక్విటీ మార్కెట్లపై కూడా ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. హైదబారాబ్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ. 45,930 ఉండగా, దేశ రాజధాని ఢిల్లీలో రూ. 48,280, ఆర్థిక రాజధాని ముంబైలో రూ. 45,420, చెన్నైలో రూ. 46,540, కోల్‌కతాలో రూ. 47,340, బెంగళూరులో రూ. 45,930 ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 1,719 డాలరు ఉండగా, వెండి ఔన్స్ రూ. 26.08గా ఉంది.