రేపు గోదావరి బోర్డు మీటింగ్.. గెజిట్ అంశాలపై విస్తృత చర్చ

దిశ, తెలంగాణ బ్యూరో: గోదావరి నది యాజమాన్య బోర్డు ఈ నెల 17వ తేదీన రెండు రాష్ట్రాలతో భేటీ కానున్నది. రెండు రాష్ట్రాల ప్రతినిధులు సభ్యులుగా ఉండే సబ్ కమిటీ సమావేశాన్ని హైదరాబాద్‌లోని జలసౌధలో నిర్వహించనున్నట్లు బోర్డు సభ్య కార్యదర్శి పాండే గురువారం రాసిన లేఖలో పేర్కొన్నారు. గతంలో సమన్వయ కమిటీ పేరుతో నిర్వహించిన సమావేశానికి దీన్ని కొనసాగింపుగా సబ్ కమిటీ పేరుతో నిర్వహిస్తున్నట్లు వివరించిన పాండే.. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఇటీవల విడుదల చేసిన గెజిట్‌లో […]

Update: 2021-09-15 19:29 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: గోదావరి నది యాజమాన్య బోర్డు ఈ నెల 17వ తేదీన రెండు రాష్ట్రాలతో భేటీ కానున్నది. రెండు రాష్ట్రాల ప్రతినిధులు సభ్యులుగా ఉండే సబ్ కమిటీ సమావేశాన్ని హైదరాబాద్‌లోని జలసౌధలో నిర్వహించనున్నట్లు బోర్డు సభ్య కార్యదర్శి పాండే గురువారం రాసిన లేఖలో పేర్కొన్నారు. గతంలో సమన్వయ కమిటీ పేరుతో నిర్వహించిన సమావేశానికి దీన్ని కొనసాగింపుగా సబ్ కమిటీ పేరుతో నిర్వహిస్తున్నట్లు వివరించిన పాండే.. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఇటీవల విడుదల చేసిన గెజిట్‌లో పేర్కొన్న పలు అంశాలపై చర్చించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు.

గెజిట్‌లో పేర్కొన్న అంశాల ప్రకారం డ్యామ్‌ల నిర్వహణ, నీటి విడుదల, సాగునీటి ప్రాజెక్టుల నియంత్రణ తదితర అంశాలపై రెండు రాష్ట్రాలకు సంబంధించి చర్చ జరగనున్నది. సబ్ కమిటీ సభ్యులు లేవనెత్తే అంశాలను కూడా చర్చించనున్నట్లు పాండే పేర్కొన్నారు.

Tags:    

Similar News