నెల రోజులకే మూతపడ్డ ఫస్ట్ సెక్స్ టాయ్స్ స్టోర్.. కారణమిదే..
దిశ, వెబ్‌డెస్క్: నెల రోజుల క్రితం దేశంలోనే తొలిసారిగా ప్రారంభించిన సెక్స్ టాయ్స్ స్టోర్ మూతపడింది. గోవాలోని కలంగూట్‌లో గతనెల 14న ప్రారంభమైన ఈ స్టోర్‌ను మూసివేస్తున్నామని ఆ గ్రామ సర్పంచ్ దినేశ్ తెలిపారు. వినియోగదారులు, చుట్టు పక్కల ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన అన్నారు. ఇదే విషయమై ఆయన మాట్లాడుతూ.. ‘స్థానికంగా ఉండే ప్రజల నుంచి మాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. ఈ సెక్స్ టాయ్స్ స్టోర్‌కు […]
దిశ, వెబ్‌డెస్క్: నెల రోజుల క్రితం దేశంలోనే తొలిసారిగా ప్రారంభించిన సెక్స్ టాయ్స్ స్టోర్ మూతపడింది. గోవాలోని కలంగూట్‌లో గతనెల 14న ప్రారంభమైన ఈ స్టోర్‌ను మూసివేస్తున్నామని ఆ గ్రామ సర్పంచ్ దినేశ్ తెలిపారు. వినియోగదారులు, చుట్టు పక్కల ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన అన్నారు.
ఇదే విషయమై ఆయన మాట్లాడుతూ.. ‘స్థానికంగా ఉండే ప్రజల నుంచి మాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. ఈ సెక్స్ టాయ్స్ స్టోర్‌కు స్థానిక ప్రభుత్వ అనుమతి (లోకల్ ట్రేడ్ లైసెన్స్) లేదు. ఆ కారణంగా దీనిని మేం మూసేస్తున్నాం..’ అని తెలిపారు. అంతేగాక.. ‘ఈ షాపులో సెక్స్‌కు సంబంధించిన వస్తువులను అమ్ముతున్నారు. అవి కొనుగోలు చేసిన పురుషులు, మహిళల నుంచి కూడా మాకు ఫిర్యాదులు అందాయి. ఈ షాపు గల్లీలో ఉన్నా ఇలాంటి వాటిని మేము అనుమతించబోం..’ అని స్పష్టం చేశారు.
దీనిపై స్టోర్ నిర్వాహకులు స్పందిస్తూ.. ‘మా ట్రేడ్ లైసెన్స్ ఇంకా పెండింగ్‌లో ఉంది. కానీ పంచాయతీ అధికారుల సమ్మతితోనే మేం స్టోర్‌ను ప్రారంభించాం. లైసెన్స్ త్వరలోనే వస్తుందని వారికి కూడా చెప్పాం. దానికి ఒప్పుకున్నాకే మేం స్టోర్‌లో కార్యకలాపాలను నిర్వహిస్తున్నాం. కానీ ఇప్పుడేమో షాపును మూసేశారు. మేం స్థానికులం (మహారాష్ట్ర నుంచి వచ్చారు) కాదు కాబట్టే స్థానిక అధికారులు మాపై కక్షగట్టారు’ అని తెలిపారు.