ప్రభుత్వ సాయం కోరిన గో ఎయిర్!
దిశ,వెబ్‌డెస్క్: కొవిడ్-19 సంక్షోభం నుంచి నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం సాయం చేయాలని విమానయాన సంస్థ గో ఎయిర్ విజ్ఞప్తి చేసింది. లాక్‌డౌన్ ఎత్తేసిన వెంటనే కార్యకలాపాలు తిరిగి ప్రారంభించడానికి సిద్ధమవుతున్నట్టు వాడియా గ్రూప్ ఛైర్మన్ నుస్లీ వాడియా, గో ఎయిర్ ఎమ్‌డీ జే వాడియా పేర్కొన్నారు. అంతర్జాతీయంగా విమానాయాన కంపెనీల కార్యకలాపాలు పునరుద్ధరణ, సిబ్బందికి జీతాలు ఇచ్చేందుకు స్థానిక ప్రభుత్వాలు, బ్యాంకులు ఆర్థికంగా సాయం చేస్తున్నాయని ప్రస్తావించారు. ఇండియాలోనూ ఆ సదుపాయాన్ని కోరామని, కానీ బ్యాంకుల నుంచి స్పష్టమైన […]
దిశ,వెబ్‌డెస్క్: కొవిడ్-19 సంక్షోభం నుంచి నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం సాయం చేయాలని విమానయాన సంస్థ గో ఎయిర్ విజ్ఞప్తి చేసింది. లాక్‌డౌన్ ఎత్తేసిన వెంటనే కార్యకలాపాలు తిరిగి ప్రారంభించడానికి సిద్ధమవుతున్నట్టు వాడియా గ్రూప్ ఛైర్మన్ నుస్లీ వాడియా, గో ఎయిర్ ఎమ్‌డీ జే వాడియా పేర్కొన్నారు. అంతర్జాతీయంగా విమానాయాన కంపెనీల కార్యకలాపాలు పునరుద్ధరణ, సిబ్బందికి జీతాలు ఇచ్చేందుకు స్థానిక ప్రభుత్వాలు, బ్యాంకులు ఆర్థికంగా సాయం చేస్తున్నాయని ప్రస్తావించారు. ఇండియాలోనూ ఆ సదుపాయాన్ని కోరామని, కానీ బ్యాంకుల నుంచి స్పష్టమైన సంకేతాలేవీ రాలేదని పేర్కొన్నారు. మార్చి 25 నుంచి కార్యకలాపాలు ఆగిపోయినప్పటికీ..బ్యాంకుల సాయం లేకపోయినా 2500 మందికి జీతాలు ఇచ్చామని, మిగిలిన సిబ్బందికి వాయిదాల రూపంలో చెల్లిస్తున్నట్టు సంస్థ వెల్లడించింది. కొందరిని జీతాల్లేని సెలవులపై పంపించినట్లు తెలిపింది.
Tags: GoAir, Coronavirus, COVID-19, Lockdown, Lockdown 3.0