తెలంగాణలో గ్లోబల్ టెండర్లకు ఆహ్వానం.. చివరిరోజు ఎప్పుడంటే..!

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కొవిడ్​ టీకాల కోసం ప్రభుత్వం గ్లోబల్​టెండర్లకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ర్టంలో మొత్తం 4 కోట్ల మందికి వ్యాక్సిన్‌ను వేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా కొవిడ్ -19 వ్యాక్సిన్ కోసం గ్లోబ‌ల్ టెండ‌ర్లకు బుధవారం ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేర‌కు గవర్నమెంట్ షార్ట్ టెండ‌ర్ నోటిఫికేష‌న్ జారీ చేసింది. గ్లోబ‌ల్ టెండ‌ర్ల ద్వారా 10 మిలియ‌న్ డోసుల వ్యాక్సిన్‌ను ప్రభుత్వమే సేక‌రించ‌నున్నట్లు టెండర్లలో పేర్కొంది. ఆన్‌లైన్ […]

Update: 2021-05-19 02:21 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కొవిడ్​ టీకాల కోసం ప్రభుత్వం గ్లోబల్​టెండర్లకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ర్టంలో మొత్తం 4 కోట్ల మందికి వ్యాక్సిన్‌ను వేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా కొవిడ్ -19 వ్యాక్సిన్ కోసం గ్లోబ‌ల్ టెండ‌ర్లకు బుధవారం ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేర‌కు గవర్నమెంట్ షార్ట్ టెండ‌ర్ నోటిఫికేష‌న్ జారీ చేసింది. గ్లోబ‌ల్ టెండ‌ర్ల ద్వారా 10 మిలియ‌న్ డోసుల వ్యాక్సిన్‌ను ప్రభుత్వమే సేక‌రించ‌నున్నట్లు టెండర్లలో పేర్కొంది. ఆన్‌లైన్ ద్వారా బిడ్ల దాఖ‌లు కోసం జూన్ 4 చివ‌రి తేదీగా నిర్ణయించారు. 6 నెల‌ల్లో 10 మిలియ‌న్ డోసుల వ్యాక్సిన్‌ను స‌ర‌ఫ‌రా చేయాల‌ని తెలంగాణ సర్కార్ నిబంధ‌న విధించింది. సప్లయ‌ర్ నెల‌కు 1.5 మిలియ‌న్ డోసులను విధిగా స‌ర‌ఫ‌రా చేయాల్సి ఉంటుందని నిబంధనల్లో స్పష్టం చేసింది

Tags:    

Similar News