రెండు రెట్లు పెరిగిన గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ త్రైమాసిక లాభం
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఔషధ సంస్థ గ్లెన్‌మార్క్ (domestic pharmaceutical company Glenmark)ఫార్మాస్యూటికల్స్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి నికర లాభం రెండు రెట్లు పెరిగి రూ. 254.04 కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం (Net profit) రూ. 109.28 కోట్లుగా నమోదైంది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత ఆదాయం (Consolidated income) రూ. 2,344.78 కోట్లుగా ఉంది. అంతకుముందు ఇది రూ. 2,322.87 కోట్లుగా ఉన్నట్టు కంపెనీ […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఔషధ సంస్థ గ్లెన్‌మార్క్ (domestic pharmaceutical company Glenmark)ఫార్మాస్యూటికల్స్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి నికర లాభం రెండు రెట్లు పెరిగి రూ. 254.04 కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం (Net profit) రూ. 109.28 కోట్లుగా నమోదైంది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత ఆదాయం (Consolidated income) రూ. 2,344.78 కోట్లుగా ఉంది.
అంతకుముందు ఇది రూ. 2,322.87 కోట్లుగా ఉన్నట్టు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్ (Regulatory Filing)లో పేర్కొంది. కొవిడ్-19 వ్యాప్తి కొనసాగుతున్నందున పరిణామాలు సవాలుగానే ఉంది. కష్టతరమైన నిర్వహణ పరిస్థితులు ఉన్నప్పటికీ సంస్థ అమ్మకాల వృద్ధిని నమోదు చేసినట్టు కంపెనీ వెల్లడించింది.
‘కంపెనీ అన్ని రకాల ఖర్చులను నియంత్రించే అంశంపై దృష్టి పెట్టిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన త్రైమాసికాల్లో దీన్ని ఇలాగే కొనసాగించనున్నట్టు గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గ్లెన్ సల్దానా చెప్పారు. తేలికపాటి, మోడరేట్ కొవిడ్-19 చికిత్స కోసం ఫావిపిరవిర్ (favipiravir)ను ప్రారంభించిన మొదటి సంస్థ తమదేనని ఆయన పేర్కొన్నారు. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ అమ్మకాల విలువ 3.68 శాతం పెరిగి రూ. 779.89 కోట్లకు చేరాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో అమ్మకాల విలువ రూ. 752.21 కోట్లని కంపెనీ తెలిపింది.