2000 ఇచ్చి ఇంటికి పంపండి: జగన్

ఆంధ్రప్రదేశ్‌లో వేల సంఖ్యలో అనుమానితులను క్వారంటైన్ కేంద్రాలకు పంపిన సంగతి తెలిసిందే. వలంటీర్ల ద్వారా సర్వే చేయించిన అనంతరం పలువురు అనుమానితులతో పాటు కఠినమైన లాక్‌డౌన్ ఆంక్షలు అమలు చేస్తూ రాష్ట్రాలు దాటిన వేలాది మందిని పోలీసులు క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. విజయవాడ, రాజమండ్రి, మచిలీపట్నం, విశాఖపట్టణంలలో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేసి అనుమానితులను అక్కడికి తరలించారు. ఈ అనుమానితులందరికీ త్వరలో గడువు పూర్తి కానుంది. 14 రోజుల క్వారంటైన్ తరువాత వారందరికీ ఏంచేయాలో, ఎలా ఇళ్లకు […]

Update: 2020-04-15 08:44 GMT

ఆంధ్రప్రదేశ్‌లో వేల సంఖ్యలో అనుమానితులను క్వారంటైన్ కేంద్రాలకు పంపిన సంగతి తెలిసిందే. వలంటీర్ల ద్వారా సర్వే చేయించిన అనంతరం పలువురు అనుమానితులతో పాటు కఠినమైన లాక్‌డౌన్ ఆంక్షలు అమలు చేస్తూ రాష్ట్రాలు దాటిన వేలాది మందిని పోలీసులు క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. విజయవాడ, రాజమండ్రి, మచిలీపట్నం, విశాఖపట్టణంలలో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేసి అనుమానితులను అక్కడికి తరలించారు. ఈ అనుమానితులందరికీ త్వరలో గడువు పూర్తి కానుంది.

14 రోజుల క్వారంటైన్ తరువాత వారందరికీ ఏంచేయాలో, ఎలా ఇళ్లకు చేరాలో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో క్వారంటైన్ కేంద్రంలో గడువు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికీ 2 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఇవాళ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ పలు నిర్ణయాలు తీసుకున్నారు. క్వారంటైన్ లో చికిత్స పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వెళ్లే వారికి వాళ్లు పాటించాల్సిన జాగ్రత్తల గురించి చెప్పాలని ఆదేశించారు.

క్వారంటైన్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లిన వ్యక్తులు ప్రతి వారం పరీక్షలు చేయించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందుతున్న తీరు, పరీక్షల నిర్వహణ, ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలను జగన్ కు అధికారులు వివరించారు. క్వారంటైన్ కేంద్రాల్లో కావాల్సిన సదుపాయాలు కల్పించాలని, రోజువారి కరోనా పరీక్షల నిర్వహణా సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. దీంతో రోజుకు నాలుగు వేల పరీక్షలు నిర్వహించేలా సామర్థ్యం పెంచుతామని అధికారులు జగన్ కు తెలిపారు.

మాన‌వ‌తా దృక్ప‌థంతో పనిచేద్దామని ఈ సందర్భంగా జగన్ అధికారులకు సూచించారు. నేటి నుండి మళ్లీ రేషన్‌ పంపిణీ చేస్తోన్న నేపథ్యంలో రేషన్‌ షాపులకు అనుబంధంగా కౌంటర్ల పెంపునకు జగన్‌ ఆదేశాలు ఇచ్చారు. లబ్ధిదారులకు వేర్వేరు రంగులతో కూడిన కూపన్లు అందజేయాలని, ఏ రోజు, ఏ సమయంలో రేషన్‌ తీసుకోవాలో కూడా ఆ కూపన్లలో సమాచారం ఇవ్వాలని నిర్ణయించారు. రేషన్‌ కోసం వచ్చే లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా షామియానాల ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

Tags: jagan, ysrcp, review meeting, 2000 compensation,

Tags:    

Similar News