పూజార్లకు ఐదు వేలివ్వండి: పవన్

దిశ ఏపీ బ్యూరో: ఏపీలో పౌరోహిత్యంపై ఆధారపడ్డ బ్రాహ్మణులను ఆదుకోవాలని ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ట్విట్టర్ మాధ్యమంగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో.. పౌరోహిత్యంపై ఆధారపడ్డవారు ఎదుర్కొంటున్న కష్టాలను ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సవివరంగా తెలియజేసిందన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులను సక్రమంగా వినియోగించాలని సూచించారు. కరోనా విపత్కర సమయంలో పురోహితులకు నెలకు రూ. 5,000, నిత్యావసర సరకులు అందించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ […]

Update: 2020-05-20 07:18 GMT
పూజార్లకు ఐదు వేలివ్వండి: పవన్
  • whatsapp icon

దిశ ఏపీ బ్యూరో: ఏపీలో పౌరోహిత్యంపై ఆధారపడ్డ బ్రాహ్మణులను ఆదుకోవాలని ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ట్విట్టర్ మాధ్యమంగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో.. పౌరోహిత్యంపై ఆధారపడ్డవారు ఎదుర్కొంటున్న కష్టాలను ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సవివరంగా తెలియజేసిందన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులను సక్రమంగా వినియోగించాలని సూచించారు. కరోనా విపత్కర సమయంలో పురోహితులకు నెలకు రూ. 5,000, నిత్యావసర సరకులు అందించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News