పాత దుపట్టా… మారిపోయేను నీ రూపు ఇట్టా
దిశ, వెబ్ డెస్క్ : అమ్మాయిలు తాము ఏలా ఉన్న తన డ్రెస్ తో మంచి లుక్ వస్తుందని భావించుకుంటారు. అందుకే మొదటి ప్రాధాన్యత వారి డ్రెస్సింగ్ కి ఇస్తారు. కొత్త బట్టలు ఎన్ని ఉన్నా.. తమకు నచ్చిన పాత డ్రెస్ లకు కొత్త అందాలను జోడించి మరి వేసుకొని మురిసిపోతారు. ప్రస్తుతం ఇదే ట్రెండ్ గా నడుస్తుంది కూడా. పాత బట్టలకు కొత్త అందాలు ఇస్తూ.. కొత్త కొత్త ఫ్యాషన్ కు అలువాటు పడుతున్నారు నేటి […]
దిశ, వెబ్ డెస్క్ : అమ్మాయిలు తాము ఏలా ఉన్న తన డ్రెస్ తో మంచి లుక్ వస్తుందని భావించుకుంటారు. అందుకే మొదటి ప్రాధాన్యత వారి డ్రెస్సింగ్ కి ఇస్తారు. కొత్త బట్టలు ఎన్ని ఉన్నా.. తమకు నచ్చిన పాత డ్రెస్ లకు కొత్త అందాలను జోడించి మరి వేసుకొని మురిసిపోతారు. ప్రస్తుతం ఇదే ట్రెండ్ గా నడుస్తుంది కూడా. పాత బట్టలకు కొత్త అందాలు ఇస్తూ.. కొత్త కొత్త ఫ్యాషన్ కు అలువాటు పడుతున్నారు నేటి తరం అమ్మాయిలు. మార్కెట్ లోకి కొత్త మోడల్ వస్తే చాలు నిన్న కొన్నదైనా సరే పక్కకే..అలా మారిపోయింది నేటి యువతరం.
అలాంటి సమయాల్లో వారు తీసుకున్న ఎన్నో డ్రెస్ లు వార్డ రోబ్ లో పడిపోయి ఉంటాయి. అందులో ఎక్కువగా చున్నీలు ఉంటాయి. అయితే అమ్మాయిలు వేసుకునే చుడీదార్ లు, అనార్కలీలు రంగులు వెలిసిపోయినా వాటి చున్నీలు మాత్రం అప్పుడే కొన్న వాటిలా మెరుస్తూ ఉంటాయి. అలా అని చెప్పి వాటిని పక్కన పెట్టడం లేదు. వాటికి కొత్త అందాలను అద్దుతూ మార్కెట్ లోకి తీసుకొస్తున్నారు.
ఏంటీ చున్నీలతో వెరైటీలా అనుకుంటున్నారా..! అవును మన పాత చున్నీతో మంచి మంచి రంగుల్లో ఉన్న వాటిని నెక్ పీస్ లుగా, స్కార్ఫ్ లుగా మార్చుకోవచ్చు. వాటని మనం మోడ్రన్ హ్యండ్ బ్యాగ్స్ లాకూడా మార్చుకోవచ్చు. పాత బనారసీ చున్నీతో అందమైన, ఆకర్షణీయమైన పౌచ్ లు తయారుచేసుకోవచ్చు. ఇలా చేసుకునే కళ ఉండాలి పనికిరాని దుస్తులు అంటూ ఏవి ఉండవు అంటున్నారు యువతులు. ఏది ఏమైనా ట్రెండ్ కి తగ్గట్టు ఉండడం తప్పుకాదేమో కదా..