నాలుగు రోజులపాటు బాలికపై సామూహిక అత్యాచారం

దిశ, ఏపీ బ్యూరో: రాజమండ్రిలో దారుణం చోటుచేసుకుంది. పనీపాటా లేక ఊర్లలోని రోడ్లపై తిరుగుతూ, తాగుడు, జల్సాల కోసం ఒంటరిగా కనిపించే వారిని దోపిడీ చేసే బ్లేడ్ బ్యాచ్ నాలుగు రోజుల పాటు బాలికన బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుర్ఘటన వెలుగు చూసింది. రాజమండ్రి నార్త్ జోన్ డీఎస్పీ టీఎస్ఎన్ రావు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. కోరుకొండ మండలం మధురపూడికి చెందిన ఓ మహిళకు ముగ్గురు కుమార్తెలు. భర్త చాలాకాలం క్రితం మృతి చెందాడు. టెన్త్‌ […]

Update: 2020-07-19 01:06 GMT

దిశ, ఏపీ బ్యూరో: రాజమండ్రిలో దారుణం చోటుచేసుకుంది. పనీపాటా లేక ఊర్లలోని రోడ్లపై తిరుగుతూ, తాగుడు, జల్సాల కోసం ఒంటరిగా కనిపించే వారిని దోపిడీ చేసే బ్లేడ్ బ్యాచ్ నాలుగు రోజుల పాటు బాలికన బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుర్ఘటన వెలుగు చూసింది. రాజమండ్రి నార్త్ జోన్ డీఎస్పీ టీఎస్ఎన్ రావు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. కోరుకొండ మండలం మధురపూడికి చెందిన ఓ మహిళకు ముగ్గురు కుమార్తెలు. భర్త చాలాకాలం క్రితం మృతి చెందాడు. టెన్త్‌ పాసయిన రెండో కుమార్తెకు రాజమహేంద్రవరంలోని ఓ దుకాణంలో పని ఇప్పిస్తానని స్థానికంగా ఉండే అనిత ఈ నెల 12న తీసుకెళ్లింది.

సాయంత్రం అనిత మాత్రమే తిరిగిరావడంతో తన కుమార్తె గురించి తల్లి ఆరా తీసింది. ఆమె తనకు తెలియదని చెప్పడంతో, ఆ తల్లి కోరుకొండ పోలీసులను ఆశ్రయించింది. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు 16వ తేదీ రాత్రి బాలిక ఆచూకీ గుర్తించారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. బాలిక కోలుకున్న అనంతరం జరిగిన ఘటనను వివరించింది. మత్తు మందుకు అలవాటు పడ్డ అనితకు క్వారీ మార్కెట్‌ ప్రాంతానికి చెందిన బ్లేడ్‌ బ్యాచ్‌తో పరిచయాలు ఉన్నాయి. పని ఇప్పిస్తానని చెప్పి ఇంటి నుంచి తీసుకెళ్లిన అనిత ఆ బాలికను పరిచయస్తులైన బ్లేడ్‌ బ్యాచ్‌ యువకులకు అప్పగించింది.

రాజమండ్రిలోని గోకవరం బస్టాండ్‌ వద్ద ఓ రూమ్‌కు బాలికను తీసుకుని వెళ్లిన యువకులు..ఆమెకు మత్తు మందు ఇచ్చి, బంధించి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా నాలుగు రోజుల పాటు ఆమెను చిత్రహింసలకు గురి చేశారు. అనంతరం దీనికి కారకులైన ఏడుగురు యువకుల్ని అరెస్టు చేశారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేసి ఇందులో నిందితులందర్నీ అరెస్టు చేస్తామని..ఎవర్నీ వదిలేది లేదని స్పష్టం చేశారు.

Tags:    

Similar News