జీహెచ్‌ఎంసీలో ’కరోనా సహాయానికి‘ ప్రత్యేక విభాగం
దిశ, న్యూస్ బ్యూరో: లాక్‌డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేదలు, కూలీలను ఆదుకునేందుకు వివిధ సంస్థలు, వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఆహార ప్యాకెట్లను, బియ్యాన్ని విరాళంగా అందిస్తున్నారు. ఉద్దేశం మంచిదైనప్పటికీ వందల సంఖ్యలో ఒకే చోట ప్రజలు గుమిగూడటంతో కరోనా వైరస్ వ్యాపించే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని నివారించేందుకు దాతల నుంచి బియ్యం, ఆహారాన్ని సేకరించేందుకు జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ ఎ. ప్రియాంక ఆధ్వర్యంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు నగర మేయర్ బొంతు […]
దిశ, న్యూస్ బ్యూరో: లాక్‌డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేదలు, కూలీలను ఆదుకునేందుకు వివిధ సంస్థలు, వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఆహార ప్యాకెట్లను, బియ్యాన్ని విరాళంగా అందిస్తున్నారు. ఉద్దేశం మంచిదైనప్పటికీ వందల సంఖ్యలో ఒకే చోట ప్రజలు గుమిగూడటంతో కరోనా వైరస్ వ్యాపించే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని నివారించేందుకు దాతల నుంచి బియ్యం, ఆహారాన్ని సేకరించేందుకు జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ ఎ. ప్రియాంక ఆధ్వర్యంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. పది మొబైల్ వాహనాల ద్వారా దాతల నుండి ఆహారం, బియ్యాన్ని సేకరించి అవసరమైన వారికి జీహెచ్‌ఎంసీ ద్వారానే పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఆహార పదార్థాలతో పాటు బియ్యం, ఇతర వస్తువులను నేరుగా పంపిణీ చేస్తే.. సంబంధిత దాతలు, వ్యక్తులపై ప్రభుత్వపరంగా కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. బియ్యం, ఆహార ప్యాకెట్లను అందజేసేందుకు ట్విట్టర్ twitter@PDUCD_GHMC ఖాతా లేదా సెల్ నెం: 94931 20244, 70939 06449 లను సంప్రదించాలని సూచించారు. తాత్కాలిక షెల్టర్ హోమ్‌లలో ఉన్న వలస కార్మికులు, నిరాశ్రయులు, అనాథలకు మాస్కులు, ఇతర వస్తువులను పంపిణీ చేసేందుకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక విభాగాన్ని సంప్రదించవచ్చునని మేయర్ తెలిపారు.
Tags : Corona, Lock down, Mayor, Preventive measures, GHMC special cell