‘దిశ’ కథనానికి స్పందన.. ఊపందుకున్న నాలా పనులు..

దిశ, వనస్థలిపురం: దిశ కథనానికి జీహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యుఎస్ యంత్రాంగం స్పందించింది. నిలిచిపోయిన బాక్స్ టైప్ నాలా పనులను తిరిగి మొదలు పెట్టింది. వనస్థలిపురం అభ్యుదయ నగర్ నుంచి పనామా గోడౌన్ మీదుగా సుష్మా, ఆటోనగర్ వరకు భారీ బాక్స్ టైప్ నాలా పనుల్లో వేగం పెంచింది. రెండు నెలలుగా చేపడుతున్న నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని నవంబర్ 9న “పనుల్లో ఇంత జాప్యమా? ” అనే కథనం ప్రచురితమైంది. ప్రస్తుతం పనామా బస్టాప్ వద్ద పనులు దాదాపు […]

Update: 2021-11-25 06:59 GMT

దిశ, వనస్థలిపురం: దిశ కథనానికి జీహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యుఎస్ యంత్రాంగం స్పందించింది. నిలిచిపోయిన బాక్స్ టైప్ నాలా పనులను తిరిగి మొదలు పెట్టింది. వనస్థలిపురం అభ్యుదయ నగర్ నుంచి పనామా గోడౌన్ మీదుగా సుష్మా, ఆటోనగర్ వరకు భారీ బాక్స్ టైప్ నాలా పనుల్లో వేగం పెంచింది. రెండు నెలలుగా చేపడుతున్న నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని నవంబర్ 9న “పనుల్లో ఇంత జాప్యమా? ” అనే కథనం ప్రచురితమైంది.

ప్రస్తుతం పనామా బస్టాప్ వద్ద పనులు దాదాపు పూర్తికావచ్చాయి. నాలా నిర్మాణ పనులు చేపట్టడానికి తవ్విన మట్టి, గ్రానైట్ రాళ్లు, ఇసుకను రోడ్డుపై నుంచి తొలగించారు. కానీ, బస్ స్టాప్ పునర్నిర్మాణ పనులు మాత్రం చేపట్టలేదు.

Tags:    

Similar News