స్టీల్ బ్రిడ్జి పనుల పరిశీలన : మేయర్ రామ్మోహన్

దిశ, న్యూస్ బ్యూరో మౌలిక వ‌స‌తుల విస్త‌ర‌ణ‌కు ప్ర‌భుత్వ ప‌రంగా చేప‌ట్టిన ప‌నుల‌ను వేగంగా పూర్తిచేసేందుకు స‌హ‌క‌రించాల‌ని ప్ర‌జ‌ల‌కు న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ విజ్ఞ‌ప్తి చేశారు. పంజాగుట్ట శ్మ‌శాన‌వాటిక వ‌ద్ద రూ.5.95 కోట్ల‌తో నిర్మించేందుకు చేప‌ట్టిన స్టీల్ బ్రిడ్జి పునాది ప‌నుల‌ను అధికారుల‌తో క‌లిసి సోమవారం మేయ‌ర్‌ ప‌రిశీలించారు. ముఫ‌కంజా ఇంజినీరింగ్ కాలేజ్ నుంచి నాగార్జున స‌ర్కిల్ వ‌ర‌కు వెళ్లే ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. శ్మ‌శాన‌వాటిక‌లోని స‌మాధుల‌కు ఎటువంటి న‌ష్టం జ‌ర‌గ‌కుండా ప‌నుల‌ను […]

Update: 2020-03-16 09:12 GMT

దిశ, న్యూస్ బ్యూరో
మౌలిక వ‌స‌తుల విస్త‌ర‌ణ‌కు ప్ర‌భుత్వ ప‌రంగా చేప‌ట్టిన ప‌నుల‌ను వేగంగా పూర్తిచేసేందుకు స‌హ‌క‌రించాల‌ని ప్ర‌జ‌ల‌కు న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ విజ్ఞ‌ప్తి చేశారు. పంజాగుట్ట శ్మ‌శాన‌వాటిక వ‌ద్ద రూ.5.95 కోట్ల‌తో నిర్మించేందుకు చేప‌ట్టిన స్టీల్ బ్రిడ్జి పునాది ప‌నుల‌ను అధికారుల‌తో క‌లిసి సోమవారం మేయ‌ర్‌ ప‌రిశీలించారు. ముఫ‌కంజా ఇంజినీరింగ్ కాలేజ్ నుంచి నాగార్జున స‌ర్కిల్ వ‌ర‌కు వెళ్లే ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. శ్మ‌శాన‌వాటిక‌లోని స‌మాధుల‌కు ఎటువంటి న‌ష్టం జ‌ర‌గ‌కుండా ప‌నుల‌ను పూర్తిచేయాల‌ని అధికారుల‌ను ఆయన ఆదేశించారు. జూలై లోపు పనులను పూర్తి చేయాల‌ని అధికారుల‌కు తెలిపారు.ఈ ప‌ర్య‌ట‌న‌లో సెంట్ర‌ల్ జోన్ ప్రాజెక్ట్స్ ఎస్‌.ఇ జ్యోతిర్మ‌యి, ఏసీపీ కృష్ణ కుమార్‌, డిఈ వెంక‌ట‌కిర‌ణ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tags, Ghmc, Mayor,Development, steel bridge

Tags:    

Similar News