ఇండస్ట్రీలో విషాదం.. ఘంటసాల రెండో కుమారుడు కన్నుమూత

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సంగీత దర్శకుడు, లెజెండరీ సింగర్ ఘంటసాల వెంకటేశ్వరరావు రెండో కుమారుడు రత్నకుమార్‌ కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యం బారినపడిన ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అంతేగాకుండా.. ఆయనకు ఇటీవల కరోనా సోకింది. కరోనా నుంచి కోలుకున్న అనంతరం కిడ్నీ సంబంధిత సంబంధిత సమస్యలతో మళ్లీ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతుండగా.. గుండెపోటు రావడంతో కన్నుమూశారు. ఘంటసాల కుమారుడిగా […]

Update: 2021-06-09 23:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సంగీత దర్శకుడు, లెజెండరీ సింగర్ ఘంటసాల వెంకటేశ్వరరావు రెండో కుమారుడు రత్నకుమార్‌ కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యం బారినపడిన ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అంతేగాకుండా.. ఆయనకు ఇటీవల కరోనా సోకింది. కరోనా నుంచి కోలుకున్న అనంతరం కిడ్నీ సంబంధిత సంబంధిత సమస్యలతో మళ్లీ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతుండగా.. గుండెపోటు రావడంతో కన్నుమూశారు. ఘంటసాల కుమారుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన రత్నకుమార్‌.. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ సినిమాలకు ఆయన డబ్బింగ్‌ చెప్పారు. వెయ్యికిపైగా చిత్రాలకు ఆయన తన వాయిస్ అందించి ఆకట్టుకున్నారు. ఎకధాటిగా ఎనిమిది గంటలపాటు డబ్బింగ్ చెప్పి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ ఆయన స్థానం సంపాదించుకున్నారు. డబ్బింగ్‌తోపాటు.. ఆట ఆరంభం, వీరుడొక్కడే, అంబేద్కర్‌తో పాటు 30కిపైగా సినిమాలకు మాటలు అందించారు.

Tags:    

Similar News