కరోనా ఘోరం.. జర్మనీలో ఆర్థిక మంత్రి ఆత్మహత్య

కరోనా వైరస్ మహమ్మారిగా మారడంతో ప్రపంచ దేశాలు స్తంభించిపోయాయి. ఇప్పటికే చాలా దేశాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. దీంతో ఈక్విటీ మార్కెట్లు పాతాలానికి పడిపోయాయి. ప్రస్తుతం ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి వెళ్లిందని శనివారం ఐఎంఎఫ్ అధికారికంగా ప్రకటించింది. ఈ పరిస్థితులను చూసి తీవ్ర నిరాశకు గురైన జర్మనీలోని హెస్సె రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ స్చఫెర్ ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. కరోనా వైరస్ కారణంగా ఛిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే పరిస్థితి లేకపోవడంతో ఆయన బలవన్మరణానికి పాల్పడినట్లు […]

Update: 2020-03-29 11:00 GMT

కరోనా వైరస్ మహమ్మారిగా మారడంతో ప్రపంచ దేశాలు స్తంభించిపోయాయి. ఇప్పటికే చాలా దేశాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. దీంతో ఈక్విటీ మార్కెట్లు పాతాలానికి పడిపోయాయి. ప్రస్తుతం ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి వెళ్లిందని శనివారం ఐఎంఎఫ్ అధికారికంగా ప్రకటించింది. ఈ పరిస్థితులను చూసి తీవ్ర నిరాశకు గురైన జర్మనీలోని హెస్సె రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ స్చఫెర్ ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. కరోనా వైరస్ కారణంగా ఛిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే పరిస్థితి లేకపోవడంతో ఆయన బలవన్మరణానికి పాల్పడినట్లు ఆ రాష్ట్ర ప్రతినిధి ప్రకటించారు. శనివారం మృతదేహాన్ని రైలు పట్టాలపై కనుగొన్నారు. హెస్సె రాష్ట్రంలోని ఫ్రాంక్ఫ్రుత్ నగరం జర్మనీ ఆర్థిక రాజధానిగా విరాజిల్లుతోంది. ఈ నగరంలోనే ప్రసిద్ధిగాంచిన బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు కార్యాలయం కూడా ఇక్కడే ఉంది. కరోనా కారణంగా విధ్వంసమవుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు థామస్ గత కొద్ది రోజులుగా తీవ్రంగా శ్రమిస్తున్నట్లు హెస్సె రాష్ట్ర ప్రతినిధి ఒకరు తెలిపారు. కంపెనీలకు, కార్మిలకు భరోసా కల్పించేందుకు కృషిచేస్తున్నారని, శనివారం ఆయన తీవ్ర నిరాశకు లోనైనట్లు గమనించినట్లు చెప్పారు.

Tags: German State Finance Minister Kills Himself As Coronavirus Hits Economy

Tags:    

Similar News