సెక్సువలైజేషన్‌కు వ్యతిరేకంగా ఫిమేల్ జిమ్నాస్ట్స్

దిశ, ఫీచర్స్ : మహిళలు పురుషులతో సమానంగా రాణించాలనుకున్నా.. ఇందుకోసం వంద శాతం ప్రయత్నిస్తున్నా.. ఏదో ఒక చోట, మరేదో రూపంలో హర్ట్ అవుతూ వెనక్కు తగ్గుతూనే ఉన్నారు. అబ్బాయిలతో సమానంగా అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నా.. సెక్సువలైజేషన్ అనేది నీడలా వెంటాడుతూనే ఉంది. ఒక ఆటకు సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నా.. అమ్మాయిలు, అబ్బాయిలు సేమ్ రూల్స్ ఫాలో అవుతున్నా.. లింగవివక్ష సమసిపోవడం లేదు. ఆడేది ఒకే గేమ్ అయినప్పుడు.. ధరించే దుస్తుల్లో మాత్రం […]

Update: 2021-05-02 09:54 GMT

దిశ, ఫీచర్స్ : మహిళలు పురుషులతో సమానంగా రాణించాలనుకున్నా.. ఇందుకోసం వంద శాతం ప్రయత్నిస్తున్నా.. ఏదో ఒక చోట, మరేదో రూపంలో హర్ట్ అవుతూ వెనక్కు తగ్గుతూనే ఉన్నారు. అబ్బాయిలతో సమానంగా అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నా.. సెక్సువలైజేషన్ అనేది నీడలా వెంటాడుతూనే ఉంది. ఒక ఆటకు సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నా.. అమ్మాయిలు, అబ్బాయిలు సేమ్ రూల్స్ ఫాలో అవుతున్నా.. లింగవివక్ష సమసిపోవడం లేదు. ఆడేది ఒకే గేమ్ అయినప్పుడు.. ధరించే దుస్తుల్లో మాత్రం ఎందుకు భేదం? ఈ విషయంలో అబ్బాయిలు కంఫర్ట్‌గా ఫీల్ అవుతుంటే.. అమ్మాయిలు మాత్రం ఎందుకు అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ కావాలి?

జర్మనీ ఉమెన్స్ జిమ్నాస్ట్స్ టీమ్‌ను ఇలాంటి ప్రశ్నలే తొలిచేశాయి. అందుకే అమ్మాయిలు జిమ్నాస్టిక్స్ చేసే సమయంలో నచ్చిన విధంగా ఎందుకు దుస్తులు ధరించకూడదు.. స్టీరియోటైప్స్‌ను ఎందుకు బ్రేక్ చేయకూడదు? మనమే ఎందుకు ఇందుకు ఉదాహరణగా నిలవకూడదనే ఆలోచనతో ముందుకొచ్చారు. ఈ క్రమంలో స్విట్జర్లాండ్‌లో జరిగిన యూరోపిన్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో న్యూ ఎగ్జాంపుల్స్ సెట్ చేస్తూ భేష్ అనిపించుకున్నారు.

సెక్సువలైజేషన్‌కు వ్యతిరేకంగా అందరిలా లియోటార్డ్స్(కాళ్లు మొత్తం కనిపించేలా) ధరించకుండా.. తమకు నచ్చిన విధంగా ఫుల్ బాడీ యూనిటార్డ్స్(కాళ్లు మొత్తం కవరయ్యేలా) ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు. మేల్ జిమ్నాట్స్ ఫీట్ చేస్తున్నప్పుడు లూజ్ షార్ట్స్, ఫుల్ లెంగ్త్ లెగ్ కవర్ అయ్యేలా డ్రెస్ చేసుకున్నప్పుడు.. ఫిమేల్ జిమ్నాస్ట్స్ మాత్రం బాడీకి అతుక్కుపోయేలా ఫిట్ అండ్ టైట్ దుస్తులు ధరించి ఎందుకు బాధపడాలని ఈ రూపంలో నిరసన వ్యక్తం చేశారు. అసౌకర్యంగా ఫీల్ అయినప్పుడు స్టీరియోటైప్స్ బ్రేక్ చేయడంలో తప్పు లేదన్న జిమ్నాస్ట్స్.. ప్రేక్షకులను అట్రాక్ట్ చేసే లియోటార్డ్స్ కాకుండా తమకు సౌకర్యవంతమైన యూనిటార్డ్స్ ధరించడం హ్యాపీగా ఉందన్నారు. తమకు నచ్చని దుస్తులు ధరించినపుడు, బాడీ పూర్తిగా కవర్ కాలేదనే ఆలోచనలతో గేమ్ మీద కాన్సంట్రేషన్ తగ్గిపోయి, ఫిమేల్ అథ్లెట్స్ సైకలాజికల్‌గా కూడా బాధపడుతున్నారని నిపుణులు చెప్తున్నారు.

కాగా, మగవారు వారి శ్రేయస్సుకోసం ఏర్పాటు చేసుకున్న ప్రాచీన సాంప్రదాయాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ను అమ్మాయిలు ఫాలో అవాల్సిన అవసరం లేదంటున్న ఎక్స్‌పర్ట్స్.. అందరూ సిమిలర్ యూనిఫామ్స్ ధరించాలనే రూల్స్ ఎందుకు రాకూడదని ప్రశ్నిస్తున్నారు.

 

Tags:    

Similar News