కోహ్లీ నువ్వు అలా చేయడమే కరెక్ట్ : సునీల్ గవాస్కర్
దిశ, వెబ్ డెస్క్ : ఇంగ్లండ్‌తో చివరి టీ20లో విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా వచ్చిన విషయం తెలిసిందే. ఓపెనింగ్ చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ 80 పరుగులతో అజేయంగా నిలిచాడు. కోహ్లీ… మరో ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి 94 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశాడు. దీనిపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించారు. గతంలో సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకొచ్చి ఓపెనర్‌గా ఆడాడని, ఆ స్థానంలో విశేషంగా రాణించాడని వెల్లడించారు. ఓపెనర్‌గా […]
దిశ, వెబ్ డెస్క్ : ఇంగ్లండ్‌తో చివరి టీ20లో విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా వచ్చిన విషయం తెలిసిందే. ఓపెనింగ్ చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ 80 పరుగులతో అజేయంగా నిలిచాడు. కోహ్లీ… మరో ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి 94 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశాడు. దీనిపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించారు.
గతంలో సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకొచ్చి ఓపెనర్‌గా ఆడాడని, ఆ స్థానంలో విశేషంగా రాణించాడని వెల్లడించారు. ఓపెనర్‌గా వచ్చిన తర్వాత సచిన్ ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. సచిన్ ఓపెనింగ్ జట్టుకు కూడా ఎంతో లాభించిందని వివరించారు. ఇప్పుడు కోహ్లీ కూడా సచిన్ లాగానే ఓపెనర్ స్థానంలో ఆడాలని గవాస్కర్ సూచించారు. జట్టులో ఉన్న అత్యుత్తమ ఆటగాడు సాధ్యమైనన్ని ఎక్కువ ఓవర్లు ఆడేందుకు ఓపెనింగ్ స్థానం వీలు కల్పిస్తుందని తెలిపారు.