అంబానీని మించిన అదానీ

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఏడాదిలో భారత కుబేరుల్లో అత్యంత ఎక్కువగా సంపాదించిన వారిలో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ అగ్రస్థానానికి చేరుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీని దాటి ఆయన ఈ స్థానాన్ని దక్కించుకున్నారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ సూచీ నివేదించిన వివరాల ప్రకారం..ఈ ఏడాది గౌతమ్ అదానీ మొత్తం సంపద ఏకంగా రూ. 1.41 లక్షల కోట్లను ఆర్జించారు. కొవిడ్-19 కారణంగా కొన్ని రంగాలు పుంజుకోవడంతో అంతర్జాతీయంగా కొందరు పారిశ్రామికవేత్తల సంపాదన అమాంతం […]

Update: 2020-11-20 10:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఏడాదిలో భారత కుబేరుల్లో అత్యంత ఎక్కువగా సంపాదించిన వారిలో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ అగ్రస్థానానికి చేరుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీని దాటి ఆయన ఈ స్థానాన్ని దక్కించుకున్నారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ సూచీ నివేదించిన వివరాల ప్రకారం..ఈ ఏడాది గౌతమ్ అదానీ మొత్తం సంపద ఏకంగా రూ. 1.41 లక్షల కోట్లను ఆర్జించారు.

కొవిడ్-19 కారణంగా కొన్ని రంగాలు పుంజుకోవడంతో అంతర్జాతీయంగా కొందరు పారిశ్రామికవేత్తల సంపాదన అమాంతం పెరిగింది. ప్రస్తుత ఏడాది జనవరి నుంచి నవంబర్ నాటికి అదానీ ఆదాయం మొత్తం రూ. 1.41 లక్షల కోట్లు అంటే ఒక రోజుకు రూ. 449 కోట్లను సంపాదించారు. ఈ స్థాయిలో ఆర్జనతో అదానీ ముఖేశ్ అంబానీని అధిగమించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ పది నెలల కాలంలో భారీగా సంపాదించిన వారి జాబితాలో తొమ్మిదో స్థానానికి చేరుకున్నారు.

అంతేకాకుండా అదానీ మొత్తం సంపద రూ. 2.24 లక్షల కోట్లకు చేరుకుంది. దీంతో ప్రపంచ సంపన్నుల జాబితాలో అదానీ 40వ స్థానంలో నిలిచారు. అలాగే, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ సంపద ఈ పది నెలల కాలంలో రూ. 1.21 లక్షల కోట్లు పెరిగింది. దీంతో ఆయమ మొత్తం సంపద రూ. 5.55 లక్షల కోట్లుగా ఉంది.

Tags:    

Similar News