రెండేళ్లుగా యువతిపై గ్యాంగ్ రేప్.. నెట్టింట్లో వీడియో వైరల్
దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్ లో అమానుష ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఒక యువతిపై రెండేళ్లుగా సామూహిక అత్యచారం చేసిన ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. తనను గ్యాంగ్ రేప్ చేసారని పోలీసులకు తెలిపినా వారు పట్టించుకోకపోవడంతో తన వీడియోలను వారు నెట్ లో పెట్టారని బాధితురాలు వాపోయింది. వివరాలలోకి వెళితే.. రాజస్థాన్ అల్వార్ జిల్లా కు చెందిన ఓ యువతి తనను కిడ్నాప్ చేసి ,సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారంటూ ముగ్గురిపై 2019 ఏప్రిల్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. […]
దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్ లో అమానుష ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఒక యువతిపై రెండేళ్లుగా సామూహిక అత్యచారం చేసిన ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. తనను గ్యాంగ్ రేప్ చేసారని పోలీసులకు తెలిపినా వారు పట్టించుకోకపోవడంతో తన వీడియోలను వారు నెట్ లో పెట్టారని బాధితురాలు వాపోయింది. వివరాలలోకి వెళితే.. రాజస్థాన్ అల్వార్ జిల్లా కు చెందిన ఓ యువతి తనను కిడ్నాప్ చేసి ,సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారంటూ ముగ్గురిపై 2019 ఏప్రిల్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదును పట్టించుకోని పోలీసులు కనీసం కేసు కూడా నమోదు చేయలేదు. దీంతో యువకులు మరోసారి రెచ్చిపోయారు.
ఇక వాళ్ళ ఆగడాలను తట్టుకోలేని యువతి మే లో కూడా పోలీసులకు తన భాదను వెళ్లగక్కింది. తనను చిత్రహింసలు పెడుతూ, వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది. అయినా ఈసారి కూడా పోలీసులు లెక్కలోకి తీసుకోలేదు. ఇక జూన్ లో నిందితుల్లో ఒకడైన గౌతమ్ మరోసారి తనతో గడపాలని, లేకపోతె తన రేప్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. ఆ బెదిరింపులను పట్టించుకోని యువతి అతడి దగ్గరకు వెళ్ళలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గౌతమ్ జూన్ 25 న ఆమె రేప్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అవి కాస్త వైరల్ అవడంతో పోలీసులు తప్పక కేసు నమోదు చేసి వికాస్, భ్రూ జాట్, గౌతం సైనీ అనే ముగ్గురు నిందితులను గురువారం అరెస్ట్ చేశారు.
పోలీసుల నిర్లక్ష్యంతోనే తన జీవితం ఇలా నాశనమయ్యిందని, మొదటిసారి ఫిర్యాదు చేసినప్పుడే వారు స్పందించి ఉంటే ఈ వీడియోలు బయటపడేవి కాదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై స్పందించని అధికారులపై చర్యలు తీసుకొంటామని పై అధికారులు తెలిపారు.